Bomb Threat Call: శంషాబాద్‌కు రావాల్సిన విమానానికి బాంబు బెదిరింపు కలకలం..
లుఫ్తాన్స్ ఎయిర్ లైన్స్ LH 752 శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సి ఉంది.

Bomb Threat Call: హైదరాబాద్ లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. జర్మనీ నుంచి పయనమైన ప్లేన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ ఫైట్ ను దారి మళ్లించారు. తిరిగి ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్టుకు తరలించారు. జర్మనీ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానానికి ఈ బాంబు బెదిరింపు వచ్చింది. లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ LH752 జర్మనీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సి ఉంది.
ఆదివారం (జూన్ 15) సాయంత్రం ఫ్రాంక్‌ఫర్ట్ నుండి హైదరాబాద్‌కు వస్తున్న లుఫ్తాన్సా విమానం బాంబు బెదిరింపు కారణంగా తిరిగి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ ద్వారా నడపబడుతున్న LH 752 విమానం సాయంత్రం 6 గంటలకు ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుండి బయలుదేరింది.
ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం విమానం దాదాపు రెండు గంటల పాటు గాల్లోనే ఉండి, బల్గేరియన్ గగనతలంపై ఎగురుతున్నప్పుడు అది యు-టర్న్ తీసుకొని ఫ్రాంక్‌ఫర్ట్‌కు తిరిగి మళ్లించబడింది. జూన్ 16, సోమవారం తెల్లవారుజామున సుమారు 1.20 గంటలకు విమానం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)కి చేరుకోవాల్సి ఉంది.