Expenses: నేను ఊపిరిపీల్చుకోవడానికి నాకు నెలకు రూ.7.5 లక్షలు కావాలి.. నెలవారీ ఖర్చులపై 3కోట్ల ఖరీదైన ఇల్లు కలిగిన వ్యక్తి పోస్ట్ వైరల్..

ఇంటికి రూ. 2.08 లక్షల EMI కట్టాలి. ఫౌంటెన్ నిర్వహణకు నెలకు రూ. 12వేలు కావాలి. కారు EMI కోసం 60వేలు కావాలి. పిల్లల కోసం IB స్కూల్‌కు నెలకు రూ. 65వేలు కావాలి.

Expenses: నేను ఊపిరిపీల్చుకోవడానికి నాకు నెలకు రూ.7.5 లక్షలు కావాలి.. నెలవారీ ఖర్చులపై 3కోట్ల ఖరీదైన ఇల్లు కలిగిన వ్యక్తి పోస్ట్ వైరల్..

Updated On : June 15, 2025 / 9:42 PM IST

Expenses: నెల వారీ ఖర్చులకు సంబంధించి ఓ వ్యక్తి ఆన్ లైన్ లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. పెరిగిపోతున్న ఖర్చులు ఏ రకమైన భారాన్ని మోపుతున్నాయో తెలిపేందుకు అతడి పోస్ట్ అద్దం పడుతుంది. ఖరీదైన ప్రాంతంలో హై-ఎండ్ లైఫ్ స్టైల్ ని మెయింటేన్ చేయడం ఎంత కష్టమో, దానికి ఎంత డబ్బు కావాలో చెబుతూ అతడు పెట్టిన పోస్ట్ విస్తృతమైన చర్చకు దారితీసింది.

గురుగ్రామ్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో హై-ఎండ్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడానికి అయ్యే ఖర్చును హైలైట్ చేస్తూ ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. హై-ఎండ్ ప్రదేశంలో విలాసవంతమైన జీవనశైలి వల్ల వచ్చే ఆర్థిక భారాన్ని అతడు వివరించాడు. “నాకు గుర్గావ్‌లో ఒక ఇల్లు ఉంది. నేను ఊపిరి పీల్చుకోవడానికి నెలకు రూ.7.5 లక్షలు అవసరం” అని అతను తన పోస్ట్ లో చెప్పాడు.

అతడి పేరు వైభవ. గురుగ్రామ్ లో ఉంటాడు. అక్కడ అతడికి 3 కోట్ల ఖరీదు చేసే ఇల్లు ఉంది. కానీ, ఏమీ లాభం లేదంటున్నాడు వైభవ్. విలాసవంతమైన ప్రాంతంలో హై ఎండ్ లైఫ్ ని లీడ్ చేయడం అంత ఈజీ కాదంటున్నాడు వైభవ్. దీనికి కారణం ఖర్చులే అని వాపోయాడు. తన ఖర్చులు ఏ రేంజ్ లో ఉన్నాయంటే.. ప్రతి నెల 7.5లక్షలు కావాలని చెబుతున్నారు. అదీ ఊపిరి పీల్చుకోవడానికి ఆ మొత్తం సరిపోతుందని చెప్పాడు.

Also Read: అధిక లాభాల పేరుతో సోదరుల ఘరానా మోసం.. 70వేల మంది నుంచి 2వేల 700 కోట్లు వసూలు..

ఇల్లు, కారు EMI, స్కూల్ ఫీజులు, విదేశీ పర్యటనలు, సిబ్బంది జీతాలు మొదలైన వాటితో సహా తన నెలవారీ ఖర్చుల వివరాలను వైభవ్ పంచుకున్నాడు. “నాకు రూ.3 కోట్ల ఖరీదైన ఇల్లు ఉంది. ఆ ఇంటికి రూ. 2.08 లక్షల EMI కట్టాలి. ఫౌంటెన్ నిర్వహణకు నెలకు రూ. 12వేలు కావాలి. కారు EMI కోసం 60వేలు కావాలి. పిల్లల కోసం IB స్కూల్‌కు నెలకు రూ. 65వేలు కావాలి. ఇక విదేశీ ప్రయాణల కోసం నెలకు రూ. 30వేలు.. ఇంట్లో పని చేసే సిబ్బందికి జీతాల కోసం (వంటవాడు, పనిమనిషి, డ్రైవర్‌) నెలకు రూ. 30వేలు కావాలి. విందులకు రూ.20,000 కావాలి. అనుకోని కొనుగోళ్లకు రూ. 10,000 కంటే ఎక్కువ కావాలి. పుట్టినరోజు, పెళ్లిళ్ల బహుమతుల కోసం 15వేలు కావాలి” అని అతడు తన నెలవారీకి అయ్యే ఖర్చుల వివరాలను వెల్లడించాడు.

”ఇలా లెక్క వేసుకుంటే నెల వారీ ఖర్చు కోసం 5 లక్షలు కావాలి. దీనికి ఆదాయపు పన్ను 30 శాతం అదనం. అంటే.. నెలకు 5లక్షలు ఖర్చు చేయాలంటే నెలకు 7.5 లక్షలు సంపాదించాలి” అని వైభవ్ వాపోయాడు.

వైభవ్ పెట్టిన పోస్ట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ”ఈ తరహా జీవనశైలిని కొనసాగించడానికి మీకు కనీసం రూ. 1.2 కోట్ల CTC అవసరం” అని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. “మీరు 3 కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేశారంటే మీరు ఆర్థికంగా స్థిరంగా ఉన్నారని అర్థం. కాబట్టి ఈ మెలోడ్రామాలో ఎటువంటి అర్థం లేదు” అని మరొక నెటిజన్ అన్నాడు.

నీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. గుర్గావ్‌లో 15 సంవత్సరాలు గడిపిన తర్వాత నీపై ఈఎంఐ భారం లేకపోతే ఈ కాంక్రీట్ అడవిలో జీవించడానికి నీకు నెలకు 3 లక్షలు కావాలి” అని మరొక యూజర్ అన్నాడు.