నాగుపామును నోట్లో పెట్టుకొని విన్యాసాలు.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువత ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు తృటిలో ప్రాణాప్రాయం నుంచి బయటపడుతున్నారు.
Snake Bite : సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువత ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు తృటిలో ప్రాణాప్రాయం నుంచి బయటపడుతున్నారు. ఇదేకోవలో కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నాగుపాము తలను నోట్లో పెట్టుకొని విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : Hyderabad : హైదరాబాద్‌లో వింత ఘటన.. భూమిలో నుంచి పొగలు.. స్థానికులు ఏం చేశారంటే?
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని దేశాయిపేట గ్రామంకు చెందిన శివ రాజులు తండ్రి గంగారం వృత్తిరిత్యా పాములు పట్టేవాడు. కుమారుడికి కూడా పాములు పట్టడం నేర్పించాడు. గ్రామంలోని డబుల్ బెడ్ రూం సముదాయంలోకి దాదాపు ఆరు అడుగుల నాగుపాము వచ్చింది. దీంతో స్థానికులు పాములు పట్టే గంగారంకు సమాచారం అందించారు. అతను అక్కడకు చేరుకొని నాగుపామును చేతులతో పట్టుకున్నాడు. ఆ తరువాత నాగుపామును కుమారుడు శివ రాజులకు ఇచ్చి వీడియో తీసి పోస్టు చేయమని చెప్పగా.. అతడు పాముతో విన్యాసాలు చేసి ప్రాణాలు కోల్పోయాడు.
పాము తలను నోట్లో పెట్టుకొని రీల్స్ చేశాడు. కొందరు శివ నాగుపాము తలను నోట్లో పెట్టుకున్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీశారు. అలాగే కాసేపు వీడియోలు, ఫొటోలు తీసిన అనంతరం యువకుడు పామును నోటి నుంచి బయటకు తీశాడు. ఆ సమయంలో పాము ఒక్కసారిగా యువకుడి చేతిని కాటేసింది. వెంటనే స్థానికులు అతన్ని హుటాహుటిన బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విషం శరీరం మెుత్తం పాకడంతో యువకుడు చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.