Chinese Manjha In Nirmal : నిర్మల్ జిల్లాలో ఘోరం.. చైనా మాంజాతో తెగిన బాలుడి గొంతు
నిర్మల్ జిల్లాలో మాంజా కలకలం రేపింది. మాంజా దారం తగిలి ఓ బాలుడి గొంతు తెగింది. కుంటాల మండలం పెంచికల్ పాడ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Chinese Manjha In Nirmal : నిర్మల్ జిల్లాలో మాంజా కలకలం రేపింది. మాంజా దారం తగిలి ఓ బాలుడి గొంతు తెగింది. కుంటాల మండలం పెంచికల్ పాడ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే బాలుడు సాయంత్రం పొలం నుంచి ఎడ్లబండిపై ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో దారిలో ఓ చెట్టుకి తట్టుకుని ఉన్న గాలిపటం మాంజ దారం మెడకు చుట్టుకుని తీవ్ర గాయమైంది.
స్థానికులు గమనించి వెంటనే వెంకటేశ్ ను ఆసుపత్రికి తరలించడంతో డాక్టర్లు చికిత్స అందించారు. దీంతో వెంకటేశ్ కు ప్రాణాపాయం తప్పింది. కాగా, మాంజా దారాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ అక్కడక్కడా కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన పంచాయితీ పాలక మండలి గ్రామంలో మాంజ దారం విక్రయించడానికి వీల్లేదంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు చేసింది.
Also Read..Flying Kites : మకర సంక్రాంతి పర్వదినాన గాలిపటాలను ఎందుకు ఎగరేస్తారో తెలుసా?
చైనా మాంజా విక్రయం, వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయినా కొందరు వ్యాపారులు కాసుల కక్కుర్తితో చైనా మాంజా విక్రయాలు గుట్టుగా సాగిస్తున్నారు. చైనా మాంజాతో కలిగే అనర్థాలు కళ్లారా చూస్తున్నా మార్పు రావడం లేదు. చైనా మాంజా వినియోగం ప్రాణాంతకంగా మారుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు.
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. గాలిపటాలు ఎగరేస్తారు. ఈ పండక్కి గాలి పటాలు ఎరవేయడం ఆనవాయితీగా వస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేదు అంతా కలిసి గాలిపటాలు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తారు. అయితే గాలిపటాలు ఎగురవేసేందుకు వినియోగించే దారం విషయంలో చాలా మంది చైనా మాంజాను వాడుతున్నారు. చైనా మాంజా ప్రాణాంతకం కావడంతో దాన్ని ఉపయోగించరాదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. అయినా క్కడపడితే అక్కడ ఆ మాంజా లభిస్తోంది.
Also Read..China Manja : గొంతులు తెగుతున్నా మార్పు రావడం లేదు.. చైనా మాంజాపై చర్యలేవి?
మార్కెట్‌లో దేశీయ దారాల కంటే చైనా మాంజా పదునుగా ఉంటుంది. ఆ దారం చాలా గట్టిగా ఉంటుంది. అస్సలు కట్ అవ్వదు. బ్లేడ్ తో లేదా కత్తెరతో కట్ చేయాల్సిందే. దీని కారణంగానే.. చాలామంది చైనా మాంజా వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఈ దారణం కారణంగా పక్షులు ఆకాశంలో ఎగిరే సమయంలో మాంజా తగిలి గాయపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడుతున్నాయి. అంతేకాదు.. మాంజాను చేతిలో పట్టుకుని ఎగిరేసే క్రమంలో వేళ్లు కోసుకుపోయి గాయాలపాలవుతున్నారు. ఈ దారం మెడకు చుట్టుకుని మెడ తెగి వ్యక్తులు చనిపోయిన ఘటనలు అనేకం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఆ మాంజాను వాడకుండా నిషేధం విధించాయి.
చైనా మాంజాను ఎంతో ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తుంటారు. తయారీలో నైలాన్ దారంతోపాటు, గాజుపొడి, హానికరమైన ఇతర కెమికల్స్ వాడుతుంటారు. ఆ మాంజా పదునుగా ఉంటుంది. చేతికి తగిలితేనే వేలు కట్ అవుతుంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
గాలి పటాలకు వాడే చైనా మాంజాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి. 2016 జనవరి 13న జీవో నెం.02 విడుదల చేశాయి. గాలిపటాలను ఎగురవేసేందుకు ఈ మాంజాను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించింది. మాంజాను విక్రయిస్తూ పట్టుబడితే భారీగా జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ మార్కెట్‌లో ఆ మాంజా యథేచ్ఛగా లభిస్తుండటం గమనార్హం.