హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం ప్రకటించారు.

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..

Gaddam Srinivas Yadav

BRS Party MP Candidates : తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమతమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం ప్రకటించారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించడంతో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

Also Read : AP Politics : టీడీపీ, జనసేనకు షాక్ ఇచ్చిన నాయకులు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన కార్యకర్తలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో సామాజిక వర్గాల వారిగా సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించారు. ఆరు నియోజకవర్గాల్లో (జహీరాబాద్, నిజామాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, భువనగిరి, హైదరాబాద్) బీసీలకు టికెట్లు కేటాయించారు. నాలుగు నియోజకవర్గాల్లో (మహబూబ్ నగర్, మెదక్, మల్కాజిగిరి, నల్గొండ) రెడ్డి సామాజిక వర్గం వారికి, కమ్మ (ఖమ్మం), వెలమ (కరీంనగర్) సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో (మహబూబాబాద్, అదిలాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి) ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాల అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు.

Also Read : జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ధనంజయ్ ఎన్నిక

అభ్యర్థులు వీరే..
చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
వరంగల్ – డాక్టర్ కడియం కావ్య
జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్
నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్
కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్
పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్
ఖమ్మం – నామా నాగేశ్వరరావు
మహబూబాబాద్ – మాలోత్ కవిత
మహబూబాబ్ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి
మల్కాజిగిరి – రాగిడి లక్ష్మారెడ్డి
అదిలాబాద్ – ఆత్రం సక్కు
సికింద్రాబాద్ – పద్మారావుగౌడ్
భువనగిరి – క్యామ మల్లేశ్
నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి
నాగర్ కర్నూల్ – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మెదక్ – వెంకట్రామిరెడ్డి
హైదరాబాద్ – గడ్డం శ్రీనివాస్ యాదవ్