Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఎక్కడికి వెళ్దామో చెప్పు.. నీకు సంస్కారం ఉందా?
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

Harish Rao
Harish Rao Challenge To Revanth Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మధిరకు పోదామా..? కొడంగల్ పోదామా..? సిద్ధిపేట పోదామా..? ఏ ఊరుకు పోదాం చెప్పు.. ఎక్కడైనా సంపూర్ణ రుణమాఫీ జరిగింది అంటే ముక్కు నేలకు రాస్తా. లేదంటే మీరు రాయండి. ప్రజలకు క్షమాపణ చెప్పండి అంటూ హరీశ్ రావు సవాల్ చేశారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటిలోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తావో చెప్పాలంటూ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
Also Read: CM Revanth Reddy : రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా : సీఎం రేవంత్‌రెడ్డి
నీకు సంస్కారం ఉందా..?
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతి పిత అయితే.. రేవంత్ రెడ్డి బూతు పిత అంటూ హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకుంటావా రేవంత్ రెడ్డి..? నీకు సంస్కారం ఉందా.. అంటూ మండిపడ్డారు. నీ వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ పరువు పోతుంది. కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి మాట సమర్థించుకుంటున్నావు. వెంటనే కేసీఆర్ కు క్షమాపణలు చెప్పు అంటూ హరీశ్ రావు డిమాండ్ చేశారు.