పాతబస్తీలోనే కాదు.. తెలంగాణలో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ఇది మొదటి మెట్టు: జగదీశ్ రెడ్డి

Jagadeesh Reddy: పాతబస్తీలో 45 శాతం బిల్లులు వసూలు అనేది పూర్తిగా అవాస్తవమని జగదీశ్ రెడ్డి తెలిపారు.

పాతబస్తీలోనే కాదు.. తెలంగాణలో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ఇది మొదటి మెట్టు: జగదీశ్ రెడ్డి

విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా పాతబస్తీలో అమలు చేస్తామన్నారని గుర్తుచేశారు. అయితే, ఈ విషయం ఇక్కడితో ఆగదని, తెలంగాణ వ్యాప్తంగానూ అమలు చేస్తారని చెప్పారు.

విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ఇది తొలి మెట్టని జగదీశ్ రెడ్డి అన్నారు. అన్ని సబ్సిడీలు రద్దవుతాయని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ తాము అంగీకరించలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కను సన్నల్లోనే కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుందని చెప్పారు.

పాతబస్తీలో 45 శాతం బిల్లులు వసూలు అనేది పూర్తిగా అవాస్తవమని జగదీశ్ రెడ్డి తెలిపారు. పాతబస్తీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 98 శాతం వరకు విద్యుత్ బిల్లులు వసూలు అవుతాయని చెప్పారు. సింగరేణి బొగ్గు గనుల విషయంలోనూ కాంగ్రెస్, బీజేపీ కలిసే పని చేస్తున్నాయని అన్నారు. విద్యుత్ విషయంలో అదే జరగనుందని, తాము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. ప్రభుత్వమే చేయలేని పనిని ప్రైవేట్ వాళ్లు చేస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని చెప్పారు.

వారితో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి