Congress: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్‌ నేతలు.. వరుసగా ఏం జరిగిందో తెలుసా?

కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కేశవరావు,

Congress: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్‌ నేతలు.. వరుసగా ఏం జరిగిందో తెలుసా?

Updated On : April 7, 2024 / 7:58 PM IST

కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్‌ నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెల్లం వెంకట్రావుతో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్‌లోకి జాయిన్ అయ్యారు.

ఎన్నికల తర్వాత తెల్లం వెంకట్రావు… కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత రేవంత్‌ రెడ్డితో భేటీ కావటం, ఇటీవల మంత్రి తుమ్మల నిర్వహించిన సమావేశంలో పాల్గొనడంతో ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారని భావించారు. అందరూ ఊహించినట్లుగానే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరటంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ ఖాళీ అయ్యింది.

కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కేశవరావు, GHMC మేయర్‌ విజయలక్ష్మి హస్తం కండువా కప్పుకున్నారు. ఎంపీలు రంజిత్‌ రెడ్డి, పసునూరి దయాకర్‌తో పాటు మరికొందరు నేతలు బీఆర్‌ఎస్‌ను వీడారు. ఇప్పుడు తాజాగా తెల్లం వెంకట్రావ్‌ సైతం కారు దిగారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు 25 మంది కాంగ్రెస్‌లో చేరుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన 24 గంటల్లోనే తెల్లం హస్తం గూటికి చేరుకున్నారు.

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్తే అనర్హత వేటు పడేలా చట్ట సవరణ చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చిందని, తెలంగాణలో మాత్రం BRS ఎమ్మెల్యేలకి కాంగ్రెస్ కండువా కప్పుతున్నారన్నారు. ఇదే కాంగ్రెస్ రీతి, నీతి అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీమంత్రి జగదీశ్ రెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పక్కనే పెట్టుకుని పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేస్తామనడం హాస్యస్పాదంగా ఉందన్నారు.

తెల్లం వెంకట్రావ్‌తోపాటు మరికొంతమంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణలో జోరందుకున్నాయి.

ఎన్నికల వేళ అతడి వద్ద 5.6 కోట్ల డబ్బుల కట్టలు, 103 కిలోల వెండి, 3 కిలోలు బంగారం స్వాధీనం