BRS MLAs Poaching Case: సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా?: డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ను ప్రశ్నించిన హైకోర్టు

సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా? అని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే, సీబీఐ ఇంకా కేసు నమోదు చేయలేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఎమ్మెల్యేల కేసు బదిలీకి మూడు సార్లు లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ... కేసు వివరాలు అప్పగించాలని సీబీఐ ఒత్తిడి చేస్తుందని అన్నారు.

BRS MLAs Poaching Case: సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా?: డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ను ప్రశ్నించిన హైకోర్టు

High Court

Updated On : February 8, 2023 / 11:30 AM IST

BRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకుని రావాలని సింగిల్ బెంచ్ చెప్పింది. రేపు ఉదయం చీఫ్ జస్టిస్ ను అనుమతి కోరతామని ఏజీ అన్నారు. కేసులో సీబీఐ విచారణకే మొగ్గు చూపుతూ తాజాగా డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిట్ అనుమతి కోరగా కోర్టు ఇప్పటికే అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ దీనిపై వాదనలు జరిగాయి.

సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా? అని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే, సీబీఐ ఇంకా కేసు నమోదు చేయలేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఎమ్మెల్యేల కేసు బదిలీకి మూడు సార్లు లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ… కేసు వివరాలు అప్పగించాలని సీబీఐ ఒత్తిడి చేస్తుందని అన్నారు.

దీంతో, ఇప్పటికే కేసు వివరాలు ఇవ్వాలని 4 సార్లు కోరామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేసు వివరాలు అడిగినా స్పందన రావడం లేదని చెప్పారు. మరోవైపు, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో వారం సమయం కావాలని ఏజీ అన్నారు. రెండు ఆర్డర్లు మెర్జ్ చేసి తాము తీర్పు ఎలా ఇవ్వగలమని హైకోర్టు ప్రశ్నించింది.

అందుకే చీఫ్ జస్టిస్ దగ్గర అనుమతి తీసుకుని రావాలని సింగిల్ జడ్జి బెంచ్ చెప్పింది. డివిజన్ బెంచ్ అనుమతి తీసుకుని వాదనలు వినిపించాలని పేర్కొంది. బీజేపీ తరఫు న్యాయవాది రవి చంద్ర స్పందిస్తూ.. ప్రభుత్వం ఇప్పటికే చాలా సమయాన్ని వృథా చేసిందని అన్నారు. ఆర్డర్ పై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరలేదని వివరించారు. గతంలోనే ప్రభుత్వానికి న్యాయస్థానం సమయం ఇచ్చిందని అన్నారు. సీబీఐతో విచారణ జరిపిస్తే ప్రభుత్వానికి నష్టం ఏంటి? అని ప్రశ్నించారు. కాగా, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

Harirama Jogaiah Vs Gudivada Amarnath : ఏపీని షేక్ చేస్తున్న కాపు ఫైట్, హరిరామజోగయ్య మంత్రి అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం