K Keshava Rao : ఆలె నరేంద్ర, విజయశాంతి తర్వాత కేకే? బీఆర్ఎస్‌లో నెంబర్ 2కి కలిసి రాని కాలం..!

కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పారాయన. ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు.

K Keshava Rao : ఆలె నరేంద్ర, విజయశాంతి తర్వాత కేకే? బీఆర్ఎస్‌లో నెంబర్ 2కి కలిసి రాని కాలం..!

Kcr Serious On Kk

K Keshava Rao : బీఆర్ఎస్ లో నెంబర్ 2 వ్యక్తులకు నిజంగానే కాలం కలిసి రావడం లేదు. గతంలో పార్టీకి నెంబర్ 2గా ఉన్న ఆలె నరేంద్ర, విజయశాంతిల తర్వాత కారు దిగేస్తున్న మూడో వ్యక్తిగా బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు సంచలనం సృష్టించబోతున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, సెక్రటరీ జనరల్ కేకే (కే కేశవరావు) కారు దిగడం దాదాపు ఖాయమైపోయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన ఫామ్ హౌస్ లో ఇవాళ కేకే కలిశారు. దాదాపు పదేళ్ల పాటు కేసీఆర్ తో కలిసి ఉన్నారు కేకే.

సెక్రటరీ జనరల్ తో పాటు రెండుసార్లు రాజ్యసభ పదవి..
సెక్రటరీ జనరల్ గా, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. కేకేకి సెక్రటరీ జనరల్ తో పాటు రెండుసార్లు రాజ్యసభ పదవి ఇచ్చింది బీఆర్ఎస్. తాను పార్టీ మారబోతున్నట్లు, కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు కేసీఆర్ కి కేకే చెప్పినట్లుగా సమాచారం. తాను కాంగ్రెస్ లోనే చనిపోతాను అని ఈ సందర్భంగా కేసీఆర్ తో కేకే అన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పారాయన. ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తున్నారు. తాను కాంగ్రెస్ లోనే చనిపోతానని, పార్టీ మారతానని నేరుగా కేసీఆర్ తో కేకే చెప్పినట్లు తెలుస్తోంది.

కేకే కుమారుడు, కూతురికి సైతం పదవులు..
కేసీఆర్ తో భేటీ సందర్భంగా కేసీఆర్, కేకే మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. మీకు, మీ కుటుంబానికి ఏం తక్కువ చేశాను? అని కేకేని కేసీఆర్ అడిగినట్లు సమాచారం. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత మీకు గౌరవప్రదమైన స్థానం ఇచ్చాను, సముచిత ప్రాధాన్యం ఇచ్చాను, ఇలాంటి సమయంలో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కేకేతో కేసీఆర్ చెప్పినట్లుగా సమాచారం. కేకే బీఆర్ఎస్ లో చేరగానే ఆయనకు సెక్రటరీ జనరల్ పోస్టుతో పాటు రాజ్యసభ కూడా ఇచ్చారు. 2020లో పదవీ కాలం ముగియగానే రెండోసారి కూడా ఆయనకే రాజ్యసభ అవకాశం కల్పించింది బీఆర్ఎస్.

కేకే కుమారుడు విప్లవ్ కుమార్ కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆయనకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా ఇచ్చింది బీఆర్ఎస్. గత ఎన్నికల్లో ర్పొరేటర్ గా గెలిచిన కేకే కుమార్తె విజయలక్ష్మికి హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చారు. కేశవరావు కుటుంబంలో అప్పటికే రెండు పదవులు ఉన్నప్పటికీ.. కేకేపై గౌరవంతో ఆయన కుమార్తెకు హైదరాబాద్ మేయర్ గా కూడా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ.

Also Read : కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను తనిఖీ చేయండి, ఆస్తుల వివరాలు బయటపెట్టండి- డీజీపీకి ఫిర్యాదు