Revanth Reddy : ఓటుకు 10 వేల రూపాయలు పంచి గెలవాలనుకుంటున్న బీఆర్ఎస్ : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గల్ఫ్ సంక్షేమ నిధి ద్వారా గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Revanth Reddy : ఓటుకు 10 వేల రూపాయలు పంచి గెలవాలనుకుంటున్న బీఆర్ఎస్ : రేవంత్ రెడ్డి

Revanth Reddy (3)

Updated On : November 18, 2023 / 10:06 PM IST

Revanth Reddy Comments BRS : ఓటుకు పది వేల రూపాయలు పంచి బీఆర్ఎస్ గెలవాలని చూస్తోందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డి రైతుల భూములు కాపాడేందుకే తాను ఇక్కడ పోటీకి దిగానని చెప్పారు. కామారెడ్డి భూములను మింగేందుకు వచ్చిన అనకొండను వేటాడేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. శనివారం కామారెడ్డి జిల్లాలో బిక్నూర్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి పిచ్చి కుక్క అని కేసీఆర్ అంటున్నాడని… పిచ్చి కుక్క ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కేటీఆర్ పిచ్చి కుక్కలా కనిపించిన వారినల్లా కరుస్తున్నాడని వెల్లడించారు. కేసీఆర్ వీధి కుక్కలా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తామని తిరుగుతున్నాడని ఘాటుగా వ్యాఖ్యానించారు.

కామారెడ్డి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వీధి కుక్కను, ఆ పిచ్చి కుక్కను పొలిమేరలకు తరమాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గల్ఫ్ సంక్షేమ నిధి ద్వారా గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హెలికాప్టర్ రాకుండా ప్రభుత్వం కుట్ర చేసినా ప్రజల కోసం రోడ్డు మార్గాన ఇక్కడికి వచ్చామని తెలిపారు. ఆనాడు రైతుల కోసం కల్లాల్లోకి కాంగ్రెస్ అంటూ బిక్నూర్ కు వచ్చి ప్రజల కోసం కొట్లాడానని చెప్పారు.

Amit Shah : బీజేపీ అధికారంలోకొస్తే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తాం : అమిత్ షా

వడగండ్ల వానపడితే కేసీఆర్ రాలేదని, రైతు గుండె ఆగి చనిపోతే చూడటానికి రాలేదన్నారు. మాచారెడ్డి రైతు లింబయ్య సచివాలయం ముందు ఉరేసుకుని చనిపోతే కేసీఆర్ ఆదుకోలేదన్నారు. కానీ కాంగ్రెస్ లక్ష రూపాయలు ఇచ్చి లింబయ్య కుటుంబానికి భరోసా ఇచ్చిందన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాని కేసీఆర్ ఇవాళ సిగ్గులేకుండా ఓట్లు అడగడానికి వస్తున్నాడని తెలిపారు.

నలబై ఏళ్లుగా వివిధ పదవుల్లో ఉన్న కేసీఆర్ కు కొనాపూర్ గుర్తురాలేదు కానీ, ఓట్ల కోసం కొనాపూర్ బిడ్డనంటూ ఇక్కడికి వస్తున్నాడని తెలిపారు. ఇక్కడి రైతుల గుండెలు ఆగినప్పుడు ఈ ప్రాంతం గుర్తురాలేదా అని ప్రశ్నించారు. గజ్వేల్ లో కేసీఆర్, సిద్దిపేటను హరీష్, సిరిసిల్లను కేటీఆర్ ఊడ్చేశారని విమర్శించారు. అక్కడ దోచుకునేందుకు ఏమీ లేకపోవడంతో కేసీఆర్ కన్ను కామరెడ్డిపై పడిందన్నారు. ముదిరాజులకు సీట్లు ఇవ్వని కేసీఆర్ కు వారి ఓట్లు మాత్రం కావాలంటన్నారు.