Group-4 Exam : గ్రూప్-4 ఎగ్జామ్ లో సెల్ ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థి.. కేసు నమోదు చేసిన పోలీసులు
పరీక్ష ప్రారంభమైన అర్ధగంట తర్వాత ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించి ఆ అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు.

Group-4 exam (1)
Candidate Cell Phone : తెలంగాణలో శనివారం(జులై1,2023)న గ్రూప్-4 ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసిందే. గ్రూప్-4 ఎగ్జామ్ కు ఓ అభ్యర్థి సెల్ ఫోన్ తో వచ్చి పట్టుబడ్డాడు. హైదరాబాద్ సరూర్ నగర్ లోని మారుతీ నగర్ సక్సెస్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్ కు ఓ అభ్యర్థి సెల్ ఫోన్ తో వచ్చాడు. పరీక్ష ప్రారంభమైన అర్ధగంట తర్వాత ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించి ఆ అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు.
ఫోన్ తో వచ్చిన సదరు అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకోవడం వల్ల చౌటుప్పల్ లో ఓ అభ్యర్థి గ్రూప్-4 పరీక్ష రాయలేకపోయాడు. ఒక అభ్యర్థి పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లేందుకు గుగుల్ మ్యాప్స్ లో చూసుకుంటూ వెళ్లాడు.
అయితే అది వేరే అడ్రస్ ను చూపించడంతో పొరపాటు గమనించి ఎగ్జామ్ సెంటర్ కు చేరుకునే సరికి 30 నిమిషాలు ఆలస్యం అయింది. దీంతో అధికారులు సదరు వ్యక్తికి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదు. చేసేది ఏమీ లేక ఆ అభ్యర్థి వెనుదిరిగాడు.