Road Accident: నకిరేకల్ వద్ద రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని కారులో మంటలు.. ఇద్దరు మృతి..

నకిరేకల్ వద్ద జాతీయ రహదారిపై కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన కారులో ప్రయాణిస్తున్నవారంతా సూర్యాపేట పట్టణం ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Road Accident: నకిరేకల్ వద్ద రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని కారులో మంటలు.. ఇద్దరు మృతి..

Road Accident

Updated On : December 16, 2022 / 8:22 AM IST

Road Accident:నల్గొండ జిల్లా నకిరేకల్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Road Accident Two Killed : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా, ఇద్దరు విద్యార్థులు మృతి

హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న కారు ఇరుపాముల బైపాస్ జంక్షన్ వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టింది. కారు బలంగా డివైడర్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా కారును చుట్టుముట్టడంతో కారులోని వారు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రమాదం ఇద్దరు మరణించారు. కారు పల్టీ కొట్టిన సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు.

Road Accident Seven Killed : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ఏడుగురు మృతి

ప్రమాదానికి గురైన కారులో ప్రయాణిస్తున్నవారంతా సూర్యాపేట పట్టణం ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ మార్చురీకి తరలించారు. చనిపోయిన వారిద్దరిని తల్లి, కొడుకుగాధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.