Car Swept Away: ప్రవాహంలో కారు కొట్టుకుపోయి నవ వధూవరులు దుర్మరణం

వికారాబాద్ జిల్లా మర్బల్లి మండలం తిమ్మాపూర్‌లో దారుణం జరిగింది. ఆగష్టు 26న వివాహం చేసుకున్న వధూవరులు ప్రవాహంలో కొట్టుకుపోయిన కారులో మృతి చెందారు.

Car Swept Away: ప్రవాహంలో కారు కొట్టుకుపోయి నవ వధూవరులు దుర్మరణం

Car Swept Away

Updated On : August 29, 2021 / 9:20 PM IST

Accident: వికారాబాద్ జిల్లా మర్బల్లి మండలం తిమ్మాపూర్‌లో దారుణం జరిగింది. ఆగష్టు 26న వివాహం చేసుకున్న వధూవరులు ప్రవాహంలో కొట్టుకుపోయిన కారులో మృతి చెందారు. రావులపల్లిలో ఉండే నవాజ్ రెడ్డికి మోమిన్‌పేటకు చెందిన ప్రవళ్లికతో వివాహమైంది.

మోమిన్‌పేటలోని అత్తారింటి నుంచి కారులో బయల్దేరారు. వాగుపొంగి రోడ్డుపైకి నీటి ప్రవాహం వేగంగా వస్తుంది. అక్కలు శ్వేత, రాధమ్మ వద్దని వారిస్తున్నప్పటికీ డ్రైవింగ్ చేసుకుని ముందుకెళ్లడంతో ప్రవాహం ధాటికి కారు ఆగలేకపోయింది. ఈ ఘటనలో వారితో పాటు మరో చిన్నారి ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.