ఈ రంగుల కళ్ల పిల్లిని ఎప్పుడైనా చూశారా?

ఈ రంగుల కళ్ల పిల్లిని ఎప్పుడైనా చూశారా?

Updated On : January 13, 2021 / 8:36 AM IST

Cat having eyes in different colors : ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల్లో పిల్లి ఒకటి.. కుక్కల మాదిరిగానే పిల్లులను పెంచుకునేందుకు చాలామంది ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇప్పటివరకూ అనేక రంగుల పిల్లులను చూసి ఉంటారు.. తెలుపు, నలుపు గోధుమ వర్ణాల్లో పిల్లులే కనిపించాయి. కానీ, ఒక పిల్లి మాత్రం అన్నింటికి భిన్నంగా కనిపిస్తోంది. చూడటానికి తెల్లగా ఉంది.. కానీ, దాని కళ్లు మాత్రం ఒకే రంగులో లేవు. ఒక్కో కన్ను ఒక్కో రంగులో ఉన్నాయి.

రెండు కళ్లు రెండు వేర్వేరు వర్ణాల్లో ఉన్నాయి. హైదరాబాద్ లోని నక్సెస్ రోడ్డుపై రంగుల పిల్లి ఒకటి ప్రత్యక్షమైంది. ఈ పిల్లి ఎడమ కన్ను గోధుమ వర్ణంలో ఉంది.. కుడి కన్ను తెలుపు నీలి వర్ణంలో ఉంది. పర్షియన్ జాతికి చెందిన పిల్లులు ఇలా రంగుల కళ్లను కలిగి ఉంటాయట.. ఏడు నెలల క్రితం పెట్ షాప్ నుంచి ఈ రంగుల పిల్లిని కొనుగోలు చేశాడో హైదరాబాదీ.