Mlc Kavitha : కవితపై సీబీఐ ప్రశ్నల వర్షం

మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో కవితపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Mlc Kavitha : కవితపై సీబీఐ ప్రశ్నల వర్షం

Cbi Questions Kavitha

Mlc Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది సీబీఐ. సీబీఐ కేంద్ర కార్యాలయంలో సీబీఐ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా పేర్కొన్న సీబీఐ.. ఈ స్కామ్ కు సంబంధించి కీలక వివరాలపై ఆమె నుంచి కూపీ లాగుతోంది.

లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారిచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్స్ పై కవితను సీబీఐ ప్రశ్నిస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో కవితపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

లిక్కర్ పాలసీని మీకు అనుకూలంగా రూపొందించమని ఢిల్లీ ప్రభుత్వంపై మీరు ఒత్తిడి చేశారా? దానికిగాను మీరు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారా? ఇలాంటి అన్ని అంశాలపై కవితను ప్రశ్నిస్తున్నారు. అలాగే మనీశ్ సిసోడియాను కలిశారా? కేజ్రీవాల్ తో మాట్లాడారా? ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి సంబంధించి మీకు అనుకూలంగా పాలసీలో మార్పులు చేయాలని, కమీషన్ రేట్లను పెంచాలని, పాలసీ ముందస్తుగా మీ వాట్సాప్ కు వచ్చిందా? ఇలా అనేక కోణాల్లో కవితను ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు.

సోమవారం ఉదయం వరకు కవిత సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. రేపు, ఎల్లుండి కూడా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. సీబీఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

Also Read : సై అంటే సై.. జహీరాబాద్‌ ఎంపీ సీటులో 3 పార్టీల మధ్య ఉత్కంఠ పోరు