మంచి ఓటింగ్ శాతం నమోదైంది, రేపు మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే- పోలింగ్‌ పర్సెంటేజ్‌పై సీఈవో వికాస్ రాజ్

పోలింగ్ పై స్క్రూటినీ ఉంటుందన్నారు. రీ పోల్ పై రేపు తెలుస్తుందన్నారు. ఇప్పటికైతే ఎలాంటి సమస్యలు లేవని వికాస్ రాజ్ తెలిపారు.

మంచి ఓటింగ్ శాతం నమోదైంది, రేపు మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే- పోలింగ్‌ పర్సెంటేజ్‌పై సీఈవో వికాస్ రాజ్

Telangana CEO Vikas Raj

Telangana Polling Percentage : తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఓటింగ్ సరళిపై తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పందించారు. మంచి ఓటింగ్ శాతం నమోదైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ వాతావరణం సహకారం అందిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా క్యూలైన్లలో ఓటర్లు ఉన్నారని తెలిపారు. లా అండ్ ఆర్డర్ లో ఎలాంటి ఇబ్బంది రాలేదన్నారు. రాత్రి 7 గంటల తర్వాతే ఓటింగ్ డేటా ఎంట్రీ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు సీఈఓ వికాస్ రాజ్.

400 ఫిర్యాదులు అందాయని, 38 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని తెలిపారు. 200కు పైగా C విజిల్ ద్వారా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. 330 కోట్లు సీజ్ చేశామన్నారు. ఇవాళ అర్థరాత్రి వరకు పోలింగ్ శాతం గంట గంటకు మారుతుందని వికాస్ రాజ్ తెలిపారు. రేపు (మే 14) మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం చెప్పడానికి అవకాశం ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూమ్ లకు EVM ల తరలింపులో వాహనాలకు GPS ఉంటుందన్నారు. పోలింగ్ పై రేపు స్క్రూటినీ ఉంటుందన్నారు. రీ పోల్ పై రేపు తెలుస్తుందన్నారు. ఇప్పటికైతే ఎలాంటి సమస్యలు లేవని వికాస్ రాజ్ తెలిపారు. అందరి నుంచి మాకు మంచి సహకారం అందిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్ లు ఉన్నాయని చెప్పారు.

Also Read : ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం.. కేసీఆర్‌ను కేఏ పాల్‌తో పోల్చిన సీఎం రేవంత్