Telangana : ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డుల ప్రదానోత్సవం

మహాత్ముడి ఆశయాలను పెంపొందిస్తూ.. సమాజ సేవ, సామాజిక విలువల అభివృద్ధి, పలు రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులను ఇవ్వనున్నారు. ఇక ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డులు...

Telangana : ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డుల ప్రదానోత్సవం

Site

Updated On : February 25, 2022 / 3:45 PM IST

Champions Of Change Telangana To Honour : ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డుల ప్రదానోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2022, ఫిబ్రవరి 25వ తేదీ శుక్రవారం బంజారాహిల్స్ లోని తాజ్ దక్కన్ – కోహినూర్ హాల్ లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిధిగా గవర్నర్ తమిలి సై హాజరు కానున్నారు. అలాగే మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ పాల్గొననున్నారు. మహాత్ముడి ఆశయాలను పెంపొందిస్తూ.. సమాజ సేవ, సామాజిక విలువల అభివృద్ధి, పలు రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులను ఇవ్వనున్నారు. ఇక ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డులు అందుకొనున్న ప్రముఖుల్లో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, జయేష్ రంజన్, అంజనీ కుమార్, అజారుద్దీన్, పీవీ సింధు, మహేష్ బాబు, అల్లు అర్జున్, సమంతలున్నారు.

Read More : War In Ukraine : ఎలాంటి భయం అవసరం లేదు..భారతీయులను క్షేమంగా తీసుకొస్తారు

స్వాతంత్ర్య సమరయోధులు, విప్లవ నాయకులు, సామాజిక కార్యకర్తలు..దేశాభివృద్ధిలో పాత్ర పోషించిన వారసత్వం తెలంగాణ రాష్ట్రానికి ఉంది. కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని రాజ్యాంగ జ్యూరీ సభ్యులచే ఎంపిక చేయబడింది. బాలకృష్ణన్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, NRC మాజీ ఛైర్మన్ తో పాటు భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇందులో ఉన్నారు. ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డుల కార్యక్రమం 2018లో జరిగింది. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవార్డు గ్రహితీలను సత్కరించారు.. మణిపూర్ సీఎం ఎన్ బీన్ సింగ్, సాధ్వి నిరంజన్ జ్యోతిలు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.

Read More : Telangana Government : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం సహాయ చర్యలు

రెండో ఎడిషన్ 2020 జనవరి 20వ తేదీన న్యూఢిల్లీలో జరిగింది. భారత మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా విచ్చేసి అవార్డులను అందచేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసొడియా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, స్వామి అవధేశానంద్ గిరిజీ ఉన్నారు. మూడో ఎడిషనల్ గోవాలోని తాజ్ రిసార్ట్ & కన్వెన్షన్ లో జరిగింది. 2021, ఏప్రిల్ 16వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మాజీ మంత్రి శ్రీపాద్ నాయక్, ఇతర ప్రముఖులుకు అవార్డులు అందచేశారు.