సైబర్ నేరగాళ్లు : బగ్గా వైన్స్ పేరిట మోసం..రూ. 51 వేలు పొగొట్టుకున్న వ్యక్తి

  • Published By: madhu ,Published On : April 6, 2020 / 10:28 AM IST
సైబర్ నేరగాళ్లు : బగ్గా వైన్స్ పేరిట మోసం..రూ. 51 వేలు పొగొట్టుకున్న వ్యక్తి

Updated On : April 6, 2020 / 10:28 AM IST

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో మద్యం ప్రియుల కష్టాలు అన్నీఇన్నీకావు. మందు దొరక్కా…కొందరు పిచ్చిగా ప్రవర్తిస్తుంటే మరికొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. అయితే లాక్‌డౌన్‌ను కొందరు సైబర్‌ కేటుగాళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలంటూ ప్రకటనలు గుప్పిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. బగ్గా వైన్స్‌ పేరుతో కోడ్‌ పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

అమౌంట్‌ పంపిస్తే అరగంటలో ఇంటికే వస్తుందంటూ బురిడీ కొట్టిస్తున్నారు. కేటుగాళ్ల మాటలు నమ్మి గౌలిపురాకు చెందిన ఓ వ్యక్తి 51 వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అయితే మద్యం ఇంటికి రాకపోవడంతో సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు. (COVID-19: ప్రధాని, రాష్ట్రపతి, ఎంపీల జీతాల్లో కోత)

కరోనా వైరస్ దెబ్బకు దేశమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. జనాలు నివాసాలకే పరిమితం అయిపోయారు. బార్లు, వైన్స్ షాపులకు తాళాలు పడ్డాయి. దీంతో మందుబాబులకు ఎక్కడి లేని కష్టం వచ్చి పడింది. చుక్క మందు దొరకడం లేదు. కొంతమంది బ్లాక్ మార్కెట్ లో విపరీతమైన ధరలకు విక్రయాలు చేశారు. ప్రతి రోజు మద్యం సేవించే వారి పరిస్థితి దారుణంగా తయారైంది.

కొంతమంది పిచ్చివాళ్లలా తయారవుతున్నారు. ఎర్రగడ్డ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. వారంలో ఒక్కరోజైనా తెరవాలని కోరుతున్నారు. తాజాగా ఆన్ లైన్ మోసం బయటపడింది. రానున్న రోజుల్లో ఎలాంటి మోసాలు వెలుగులోకి వస్తాయ చూడాలి.