Chevella Road Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యేను రాళ్లతో కొట్టబోయిన జనం..
Chevella Road Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును
Chevella Road Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనంలో డ్రైవర్ల వైపు బస్సు, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. అయితే, ప్రమాదం సమయంలో టిప్పర్ లారీ ట్రక్కులో నిండుగా కంకర ఉండటంతో ఆ కంకర మొత్తం బస్సు ముందుభాగంలో కూర్చుకున్న ప్రయాణికులపై పడింది. ఈ ఘటనలో బస్సు, లారీ డ్రైవర్ సహా 19మంది ప్రయాణికులు మరణించారు. అయితే, ప్రమాద స్థలికి ఎమ్మెల్యే వెళ్లగా.. ఆయనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు దాడికి యత్నించారు.

మీర్జాగూడ బస్సు ప్రమాద స్థలికి చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య వెళ్లారు. దీంతో ఆయనపై కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేపై రాళ్లు ఎత్తారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకున్న పోలీసులతో స్థానికులు వాగ్వాదంకు దిగారు. బస్సును ఇక్కడ నుండి తొలగించొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రమాద స్థలం నుంచి ఎమ్మెల్యే కాలె యాదయ్య కారు ఎక్కి వెళ్లిపోయారు.
