Hyderabad Heavy Rains : సినిమా థియేటర్లోకి వర్షపు నీరు… గోడ కూలి 50 బైక్ లు ధ్వంసం

దిల్ సుఖ్ నగర్ లోని శివగంగ సినిమా హాల్ కు వరద పొటెత్తింది. ధియేటర్ లోకి భారీగా వర్షపు నీరు చేరి హాలులోని కుర్చీలు మునిగిపోయాయు.

Hyderabad Heavy Rains : సినిమా థియేటర్లోకి వర్షపు నీరు… గోడ కూలి 50 బైక్ లు ధ్వంసం

Shiva Ganga Cinema Theatre

Updated On : October 10, 2021 / 8:22 AM IST

Hyderabad Heavy Rains :  హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు  లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దిల్ సుఖ్ నగర్ లోని శివగంగ సినిమా హాల్ కు వరద పొటెత్తింది. ధియేటర్ లోకి భారీగా వర్షపు నీరు చేరి హాలులోని కుర్చీలు మునిగిపోయాయు.

ధియేటర్ ప్రహరీ గోడ కూలి అక్కడ పార్క్ చేసిన సుమారు 50 ద్విచక్రవాహనాలా ధ్వంసం అయ్యాయి. ఫస్ట్ షో చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Also Read : Heavy Rains : హైద‌రాబాద్ లో నేటి మ‌ధ్యాహ్నం భారీ వ‌ర్షాలు

రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు నిలిచి ఉంది.. ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని సరూర్ నగర్ చెరువు నుండి వచ్చే వరద నీటితో గడ్డి అన్నారం డివిజన్లో పలు కాలనీలు ఇబ్బందులు పడుతున్నాయి.. రాత్రి నుండి వరద నీరు రోడ్లపై పారుతుండటంతో స్థానికులు, వ్యాపారులు పలు ఇబ్బందులు పడుతున్నారు.