Chief Justice : నేడు రామప్ప ఆలయానికి సీజేఐ ఎన్వీ రమణ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ శని, ఆదివారాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు.

Chief Justice : నేడు రామప్ప ఆలయానికి సీజేఐ ఎన్వీ రమణ

Chief Justice

Updated On : December 18, 2021 / 9:19 AM IST

Chief Justice : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ శని, ఆదివారాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ములుగు జిల్లాలోని రామప్ప గుడితోపాటు, రామప్ప చెరువును జస్టిస్‌ రమణ దంపతులు సందర్శించనున్నారు. రాత్రి రాష్ట్రప్రభుత్వం ఇచ్చే విందుకు రమణ దంపతులు హాజరవుతారు. రాత్రికి హనుమకొండలోని ఎన్‌ఐటీ అతిథిగృహంలో బస చేస్తారు.

చదవండి : CJI NV Ramana : డాలర్ శేషాద్రి మరణం నాకు తీరని లోటు-జస్టిస్ ఎన్.వీ.రమణ

ఆదివారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం హనుమకొండలోని కోర్టుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. ఆదివారం సాయంత్రం షామీర్‌పేటలోని నల్సార్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఆ రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేసి సోమవారం తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

చదవండి : Chief Justice NV Ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ అనంతపురం పర్యటన
చదవండి : NV Ramana : న్యాయమూర్తులు అందరికీ అర్థమయ్యే భాషలో తీర్పులు రాయాలి