CJI NV Ramana : డాలర్ శేషాద్రి మరణం నాకు తీరని లోటు-జస్టిస్ ఎన్.వీ.రమణ

తిరుమల   శ్రీవారి ఆలయ   ఓఎస్డీ శేషాద్రిస్వామితో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.

CJI NV Ramana : డాలర్ శేషాద్రి మరణం నాకు తీరని లోటు-జస్టిస్ ఎన్.వీ.రమణ

New Project

CJI NV Ramana :  తిరుమల   శ్రీవారి ఆలయ   ఓఎస్డీ శేషాద్రిస్వామితో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. శేషాద్రిస్వామి మరణం తనకు, తన కుటుంబానికి తీరని లోటని ఆయన పేర్కోన్నారు. శేషాద్రి మరణ వార్త తెలుసుకున్న ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తిరుపతి విచ్చేసి శేషాద్రి పార్ధివ దేహానికి పుష్ప గుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ …శేషాద్రిస్వామి తిరుమలకు సంబంధించిన విశేషాలు, సేవలు, ఉత్సవాల విశేషాలను ప్రముఖులకు చక్కగా వివరించే వారన్నారు. 43 సంవత్సరాలుగా ఆయన శ్రీవారి సేవ చేస్తూ తుది శ్వాస కూడా స్వామి సేవలోనే వదిలారని అన్నారు. తిరుమలలో జరిగే కైంకర్యాలు, ఉత్సవాలు, సేవలకు సంబంధించిన విషయాలతో శేషాద్రిస్వామి క్రోడీకరించిన పుస్తకాన్ని టీటీడీ ముద్రించి భవిష్యత్ తరాల వారికి అందించాల్సిన అవసరం ఉందని జస్టిస్ రమణ చెప్పారు.
Also Read : Sirivennela : సిరివెన్నెల మరణం.. విశ్వనాథ్ భావోద్వేగం..
ప్రముఖులు ఎవరొచ్చినా శేషాద్రిస్వామితో ఫోటో దిగకపోతే తిరుమల యాత్ర చేసిన అనుభూతి ఉండేది కాదన్నారు. ఇకమీదట తాను తిరుమలకు వస్తే ఆ రకమైన అనుభూతి ఊహించుకోలేనని ఆయన పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి  వారు శేషాద్రిస్వామి ఆత్మకు శాంతి కలిగించాలని   జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రార్ధించారు.