CJI NV Ramana : యాదాద్రికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈరోజు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు.

CJI NV Ramana : యాదాద్రికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Cji Nv Ramana

Updated On : June 15, 2021 / 8:53 AM IST

CJI NV Ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈరోజు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌‌లో సతీసమేతంగా బయలుదేరి, యాదాద్రి కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ  అతిథిగృహం వద్దకు చేరుకుంటారు.

స్వామివారి దర్శనం, ఆశీర్వచనం అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. వీవీఐపీ అతిథి గృహంలో అల్పాహారం స్వీకరించిన తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

తిరుగు ప్రయాణంలో ప్రెసిడెన్షియల్‌ విల్లా కాంప్లెక్స్‌, యాదాద్రి టెంపుల్‌ సిటీని పరిశీలించే అవకాశం ఉన్నది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సీజేఐతోపాటు పర్యటనలో పాల్గొననున్నారు.