Clash : బీజేవైఎం, మైనంపల్లి అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ

బీజేవైఎం బాధితుల పక్షాన నిలిచింది. రాక్ లైన్ రెవెన్యూ కార్యాలయం అద్దాలు, గోడలను బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేశారు.

Clash : బీజేవైఎం, మైనంపల్లి అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ

Alwal Clash

Updated On : September 13, 2023 / 11:19 PM IST

BJYM – Mynampally Followers Clash :హైదరాబాద్ లోని సికింద్రాబాద్ అల్వాల్ లో బీజేవైఎం, మైనంపల్లి అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రాక్ ల్యాండ్ రెవెన్యూ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైనంపల్లి అనుచరులు రాక్ ల్యాండ్ రెవెన్యూలో కబ్జా చేశారంటూ బాధితులు ఆరోపణలు చేశారు.

బీజేవైఎం బాధితుల పక్షాన నిలిచింది. రాక్ లైన్ రెవెన్యూ కార్యాలయం అద్దాలు, గోడలను బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. రెవెన్యూ మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం కారణంగానే తాము రంగంలోకి దిగినట్లు బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయిప్రసాద్ వెల్లడించింది.

Kishan Reddy : ఇందిరాపార్క్ వద్ద కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. బీజేపీ కార్యాలయంలో కొనసాగింపు

అద్దాలు ధ్వంసం చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా మైనంపల్లి అనుచరులు రంగ ప్రవేశం చేశారు. బీజేవైఎం నాయకులపై మైనంపల్లి అనుచరులు రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.