Andhra Pradesh : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో హైటెన్షన్.. కోడిగుడ్లు, కర్రలతో దాడి .. వైసీపీ నేత మల్లాది విష్ణు అరెస్ట్..!
Andhra Pradesh : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది.
Clash between YCP and TDP cadres in Vijayawada Central constituency
Andhra Pradesh : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, కోడి గుడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకిదిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read : AP Agrigold Lands: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త.. వేలం వేయడానికి నిర్ణయం
డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ముత్యాలమ్మపాడులోని గవర్నమెంట్ ప్రెస్ వద్ద రిలే నిరాహార దీక్షను చేపట్టారు. వైసీపీ దీక్షా శిబిరం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఆయన అనుచరులు చేరుకున్నారు. వైసీపీ వేసిన టెంట్లను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. కుర్చీలను విరగొట్టారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కోడిగుడ్లు, కర్రలతో దాడి చేసుకోవటంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జై చంద్రబాబు.. జై జగన్ అంటూ ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఇరువర్గాల వారిని అడ్డుకున్నారు. అనంతరం అనుమతి లేకుండా దీక్ష చేస్తున్న మల్లాది విష్ణును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నా చోద్యం చూస్తున్నారంటూ పోలీసులు తీరు పై ఎమ్మెల్యే బోండా ఉమ ఆగ్రహం
వ్యక్తం చేశారు. అయితే, మల్లాది విష్ణు మాట్లాడుతూ.. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా మాపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేశ్ డీఎస్సీపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు.. మేము చర్చకు సిద్ధమని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ.. నారా లోకేశ్ ను బూతులు తిడితే ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై 10టీవీ వేదికగా చర్చకు సిద్ధమన్నారు.
