CM KCR : రేపు నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. ఉదయం 10 గంటలకు టీవీలు చూడండి..!

తెలంగాణలో నిరుదోగ్యులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. బుధవారం (మార్చి 9) అసెంబ్లీ వేదికగా ఉదయం 10 గంటలకు రాష్ట్ర నిరుద్యోగుల కోసం కీలక ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు.

CM KCR : రేపు నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. ఉదయం 10 గంటలకు టీవీలు చూడండి..!

Cm Kcr Cm Kcr To Good News For Telangana Unemployees Tomorrow

Updated On : March 8, 2022 / 6:18 PM IST

CM KCR :  తెలంగాణలో నిరుదోగ్యులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ నూతన ఆవిష్కరణపై రేపు బుధవారం (మార్చి 9) అసెంబ్లీ వేదికగా చెప్పబోతున్నానని కేసీఆర్ అన్నారు.  ఉదయం 10 గంటలకు రాష్ట్ర నిరుద్యోగుల కోసం కీలక ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువ సోదరులకు సంబంధించి ప్రకటన చేయనున్నట్టు తెలిపారు. నిరుద్యోగ సోదరులంతా ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని అన్నారు. అసెంబ్లీ వేదికగా నిరుద్యోగుల కోసం ఏ ప్రకటన చేయబోతున్నాననో చూడాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

వనపర్తి జిల్లాలోని బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా అవుతుందని ఎవరూ కలగనలేదని అన్నారు. నాడు మహబూబ్ నగర్ పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. ఎన్నో రకాల అవహేళనలు చేసినా రాష్ట్రం కోసం పోరాడామని, పాలమూరు జిల్లాలో అద్భుతమైన పంటలు పండుతున్నాయని తెలిపారు.

Cm Kcr Cm Kcr To Good News For Telangana Unemployees Tomorrow (1)

Cm Kcr To Good News For Telangana Unemployees Tomorrow

11 రాష్ట్రాల నుంచి ఇక్కడికి కూలీలుగా వస్తున్నారని, ఏడేళ్లు అవినీతి రహితంగా పనిచేశామని చెప్పారు. అందుకే ఈ ఫలితాలొచ్చాయని కేసీఆర్ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో నాడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదని, నేడు 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ నుంచి గద్వాల వరకు ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయని తెలిపారు.

తలసరి ఆదాయంలో నెంబర్ వన్.. విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ :
నేడు పాలమూరు జిల్లా పాలుకారుతోందన్నారు. గిరిజన, లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి అయితే 15 లక్షల నుంచి 16 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయని తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు.

విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. నా తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు లేవని కేసీఆర్ తెలిపారు. కరువు రాదు, వలసలు ఉండవని తెలిపారు. ఇతర ప్రాంతాల వారే మన దగ్గరకు వచ్చి బతకాలని కేసీఆర్ చెప్పారు. దళితబిడ్డల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకం ప్రవేశపెట్టామన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు అందిస్తున్నామని కేసీఆర్ స్పష్టంచేశారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కొందరు గోల్ మాల్ గోవిందం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కుల, మత విద్వేశాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు వారి ఆటలు సాగవన్నారు. దేశం, భారతజాతిని బలిపెట్టే విష ప్రయత్నాలు జరుగుతున్నాయని కేసీఆర్ ఆరోపించారు. ప్రజలు, మేథావులు వాళ్ల కుట్రలను తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు.

Read Also : CM KCR‌ : నేడు వనపర్తికి సీఎం కేసీఆర్‌.. ‘మన ఊరు – మన బడి’కి శ్రీకారం