CM KCR focus : ఆ మూడు జిల్లాలపై సీఎం కేసీఆర్ ఫోకస్‌

హైదరాబాద్‌ నగరానికి అనుసంధానమై అభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ చేసింది.

CM KCR focus : ఆ మూడు జిల్లాలపై సీఎం కేసీఆర్ ఫోకస్‌

Cm Kcr Focuses On Rangareddy Medchal And Malkajgiri Districts

Updated On : April 3, 2021 / 10:50 AM IST

CM KCR focuses on three districts : హైదరాబాద్‌ నగరానికి అనుసంధానమై అభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ చేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి, శాశ్వత పరిష్కారం కోసం సీఎస్ సోమేశ్‌ కుమార్‌ అధ్యక్షతన ఓ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఈ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, ఇతర ముఖ్య పట్టణాల్లో వెజ్‌ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణంతో పాటు, టౌన్ హాల్స్ నిర్మాణం, రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నెలకోసారి ప్రజాప్రతినిధులు సీఎస్‌తో క్రమం తప్పకుండా సమావేశం కావాలన్నారు.