Independence Day 2023 : తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెం.1.. గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. రూ.3,12,319 తలసరి ఆదాయంతో దేశంలోనే నెం.1గా నిలిచామని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందన్నారు.

Independence Day 2023 : తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెం.1.. గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్

CM KCR Independence Day

CM KCR Independence Day 2023 : హైదరాబాద్ లో స్వాతంత్య్ర దినోత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశం ఆశించిన లక్ష్యాలను ఇంకా చేరుకోలేదన్నారు. అన్నీ ఉండి కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వనరులను వినియోగించుకుని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నారు. గతంలో తెలంగాణ వివక్షకు గురైందని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్నారు.

ఎక్కడ చూసినా పడావు భూములు కనిపించేవి అన్నారు. విధ్వంసమైన తెలంగాణను విజయవంతంగా ముందుకు నడిపామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కుతున్నామని తెలిపారు. పచ్చటి పంటపొలాలు, కాల్వలతో కళకళలాడుతోందన్నారు. అనతి కాలంలోనే తిరుగులేని ప్రగతిని సాధించామని వెల్లడించారు.తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోంది అని అన్నారు.

Independence Day 2023 : త్రివర్ణ పతాకం 140 కోట్ల భారతీయుల గుండె.. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం జగన్

చుక్క నీటికి అల్లాడిన తెలంగాణ నేడు 20కి పైగా రిజర్వాయర్లతో పూర్ణ కలశంగా మారిందని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ ప్రగతి వైపు చూస్తోందన్నారు. గత ఏడాది స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా జరుకున్నామని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.12 లక్షలుగా ఉందని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెం.1 అని గర్వంగా చెప్పారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. రూ.3,12,319 తలసరి ఆదాయంతో దేశంలోనే నెం.1గా నిలిచామని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందన్నారు. గత నెలలో అసాధారణ వర్షం కురిసింది, వరదలు సంభవించాయని తెలిపారు.ముందు జాగ్రత్త చర్యలతో భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించ గలిగామని తెలిపారు. బాధితులకు రూ.500 కోట్లు విడుదల చేసి అండగా నిలిచామని చెప్పారు.