CM KCR Inaugurated : మహబూబ్‌నగర్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ ఇవాళ మహబూబ్‌నగర్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అంతముందు కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

CM KCR Inaugurated : మహబూబ్‌నగర్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

CM KCR inaugurated

Updated On : December 4, 2022 / 3:55 PM IST

CM KCR Inaugurated : సీఎం కేసీఆర్‌ ఇవాళ మహబూబ్‌నగర్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని పాలకొండ వద్ద నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
అంతముందు కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

ఆ తర్వాత సీఎం కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి, చాంబర్ లో కలెక్టర్ వెంకట్రావ్ ను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Mahabubnagar : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన మహబూబ్ నగర్ మహిళలు

అంతకముందు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ మైదానంలో జరుగనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.