CM KCR : కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

45 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15, 600 ఇళ్ల నిర్మాణం చేశారు. జీ+9 నుంచి జీ+10, జీ+11 అంతస్తుల వరకు టౌన్ షిప్ నిర్మాణం చేశారు.

CM KCR : కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR (3)

Double Bed Room Township : సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ కి కేసీఆర్ నగర్ గా నామకరణం చేశారు. సీఎం చేతులమీదుగా ఆరుగురు లబ్ధిదారులు ఇళ్ల పట్టాలు అందుకున్నారు.

145 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15, 600 ఇళ్ల నిర్మాణం చేశారు. జీ+9 నుంచి జీ+10, జీ+11 అంతస్తుల వరకు టౌన్ షిప్ నిర్మాణం చేశారు. మొత్తం 117 బ్లాక్‌లు, బ్లాక్ కి 2 లిఫ్ట్ ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్ లను ఏర్పాటు చేశారు. ఈ టౌన్ షిప్ లో మురుగునీటి శుద్ధి ప్లాంట్, స్కూల్స్, 118 వాణిజ్య దుకాణాల నిర్మించారు.

Kerala : విడాకుల విషయంలో కోర్టు తీర్పుపై ఆగ్రహం.. ఏకంగా జడ్జి కారునే ధ్వంసం చేసిన వ్యక్తి

కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని సీఎం పరిశీలించారు. టౌన్ షిప్ లో ఉన్న మౌలిక వసతులు, ఇతర వివరాలను సీఎం కేసీఆర్ కి అధికారులు వివరించారు.