CM KCR Nalgonda Tour : రేపు నల్గొండకు సీఎం కేసీఆర్..
నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ బుధవారం పర్యటించనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య దశదినకర్మ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొననున్నారు.

Cm Kcr
CM KCR : నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ బుధవారం (డిసెంబర్ 29) పర్యటించనున్నారు. జిల్లాలోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య దశదినకర్మ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొననున్నారు. కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మారయ్య చిత్రపటానికి పూలమాల వేసి సీఎం శ్రద్ధాంజలి ఘటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కేసీఆర్ నల్గొండ బయల్దేరనున్నారు.
నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ల్యాండ్ కానున్నారు. సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఇంటికి చేరుకోనున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించనున్నారు. భోజనం అనంతరం హైదరాబాద్కు కేసీఆర్ తిరుగు ప్రయాణం కానున్నారు.
కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. స్థానిక ఎమ్మెల్యే సహా అధికారులు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరి ఎన్జీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ పనులను, భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. పోలీసు అధికారులకు సూచనలు చేశారు.
Read Also : తెలంగాణలో పెరగనున్న కరెంట్ చార్జీలు