Komatireddy : దత్తత తీసుకున్న నల్గొండలో ఒక్క ఇల్లు ఇవ్వలేదు.. కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కేటీఆర్ ఐటీ మంత్రి కాదు.. విదేశాంగ మంత్రి అని ఎద్దేవా చేశారు. నెలకు 15 రోజులు విదేశాల్లో ఉండే కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Komati Reddy Venkat Reddy
Komatireddy Venkat Reddy – CM KCR : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో దత్తత పేరుతో నల్గొండ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని పేర్కొన్నారు. గజ్వేల్, సిద్దిపేటలో వేల ఇళ్లు ఇచ్చారు.. దత్తత తీసుకున్న నల్గొండలో ఒక్క ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. జిల్లాలో ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెళ్లేంల ప్రాజెక్ట్ లను పూర్తి చేయలేదన్నారు. గతంలో ఉన్న ఎంపీలు కనీసం జిల్లా సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. రోడ్డు విస్తరణ చేసి ప్రజలకు పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.
ఈ సారి ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ మేరకు కోమటిరెడ్డి బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నియోజకవర్గ బూత్ స్థాయి సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. ప్రజా దర్భార్ పెట్టని ఏకైక సీఎం కేసీఆర్.. తెలంగాణకు ఇటువంటి సీఎం ఉండడం మన దౌర్భాగ్యం అన్నారు. పైరవీకారులు, కబ్జా కోరులకే ప్రగతి భవన్ లో అపాయింట్ మెంట్ లభిస్తుందని చెప్పారు. తాను ఎంపీగా ఎన్నిసార్లు అపాయింట్ మెంట్ అడిగినా స్పందించలేదన్నారు. 13వ తేదీకి కూడా జీతాలు రాక ఉద్యోగస్తులు నానా యాతన పడుతున్నారని తెలిపారు.
Rajinikanth : చంద్రబాబు అరెస్ట్ పై రజనీకాంత్ రియాక్షన్, కీలక వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్
కేటీఆర్ ఐటీ మంత్రి కాదు.. విదేశాంగ మంత్రి అని ఎద్దేవా చేశారు. నెలకు 15 రోజులు విదేశాల్లో ఉండే కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ మాటలు వింటుంటే నవ్వు వస్తుందన్నారు. కేటీఆర్ ఓ బచ్చాగాడు.. జీతాలు ఇవ్వడం చేతగాకుండా మొనగాడిని అని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. తండ్రి, తనయులకు రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన కొడుకు కు టికెట్ రాక మతి తప్పి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. గురువారం నుండి నల్గొండ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే బూతు స్థాయి సమావేశాలు నిర్వహించామని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించామని వెల్లడించారు.