భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష

cm kcr : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో 2020, అక్టోబర్ 15వ తేదీ గురువారం ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 03 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలతో రావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మున్సిపల్, వ్యవసాయ, పంచాయత్‌రాజ్, విద్యుత్‌శాఖల మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, మున్సిపల్, వ్యవసాయ, ఆర్‌అండ్‌బీ శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ సమీక్షకు హాజరుకానున్నారు.
ఆయా శాఖలకు సంబంధించి ఎంత నష్టం జరిగింది ? ఎన్ని నిధులు కావాల్సిన దానిపై అంచనా వేయాలని సూచించారు. హైదరాబాద్ లో తీసుకున్న చర్యలు, తదితర వివరాలపై సీఎం కేసీఆర్ ఆరా తీయనున్నారు. కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పేర్కొనాల్సిన అంశాలపై సీఎం సమీక్షించనున్నారు.
హైదరాబాద్ లోల వరద బీభత్సం సృష్టించింది. ప్రాణనష్టం కూడా భారీ సంఖ్యలోనే ఉంది. 24 గంటల్లో 30మందికి పైగా వర్షం మింగేసింది. పల్లె చెరువులో ఆరుగురి మృతదేహాలు గుర్తించగా.. మరో 9 మంది గల్లంతయ్యారు.. ఎస్ఆర్ నగరలో ఇద్దరు మృతిచెందగా.. దిల్‌సుఖ్‌నగర్‌లో మూడేళ్ల చిన్నారి సెల్లార్ నీటిలో మునిగి మృతిచెందింది..
చాంద్రాయణగుట్ట బండ్లగూడ మహ్మద్‌నగర్‌లో ప్రహరీ గోడ కూలి.. పక్కనే ఉన్న రెండు ఇళ్లపై పడింది. దాంతో ఇళ్లలో నిద్రిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది ఆ శిథిలాల మధ్య చిక్కుకుని మరణించారు. హయత్‌నగర్‌లో ఇద్దరు మృతిచెందగా.. నాగోల్‌లో పోస్ట్‌మన్ వరదనీటిలో కొట్టుకుపోయాడు..
అంబర్‌పేట్‌లో విద్యుత్ షాక్‌తో ఒకరు మృతిచెందారు.. బంజారాహిల్స్‌లో ఓడాక్టర్ కరెంట్ షాక్‌తో కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో గోడకూలి తల్లి, కూతురు మృతిచెందారు.. వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య మొత్తంగా 30కు పైగానే ఉంది.