CM KCR : ఇక తగ్గేదేలే, ఇది తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా, ఆకట్టుకుంటున్న హాట్ బెలూన్
గులాబీ కలర్స్ తో ఉన్న ఫ్లెక్సీలు, కటౌట్ లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన హాట్ బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దానిపై ఇక తగ్గేదేలే...

Cm Kcr To Hold Public Meeting In Jangaon
TRS Jangaon : ఇక తగ్గేదేలే, ఇది తెలంగాణ గడ్డ.. ఇదోదో సినిమాలో ఎవరో డైలాగ్ చేసింది కాదు. ఇది తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ ఉన్న ఓ హాట్ బెలూన్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2022, ఫిబ్రవరి 11వ తేదీ శుక్రవారం జనగామ జిల్లాకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. అక్కడ నిర్వహిస్తున్న బహిరంగసభ గులాబీమయంగా మారిపోయింది.
Read More : Hijab Controversy : దేశమా, మతమా ఏది అత్యున్నతమైంది ? మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
గులాబీ కలర్స్ తో ఉన్న ఫ్లెక్సీలు, కటౌట్ లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన హాట్ బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దానిపై ఇక తగ్గేదేలే, ఇది తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని రాశారు. భారీగా జనసమీకరణ చేయాలని గులాబీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భారీ బహిరంగసభపై అందరి దృష్టి నెలకొంది. ఎందుకంటే… రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాన మంత్రి మోదీ చేసిన కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. దీంతో మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎలాంటి కౌంటర్ ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది.
Read More : Ramesh varma : స్టేజిపైనే హీరోయిన్‌కి సారీ చెప్పిన ఖిలాడీ డైరెక్టర్
ఇక సీఎం కేసీఆర్ పర్యటన విషయానికి వస్తే… ఉదయం 11గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి.. 11.30గంటలకు జనగామకు చేరుకుంటారు. ముందుగా కలెక్టరేట్ భవనం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.20గంటల నుంచి 1.20గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు సభా ప్రాంగణానికి చేరుకొని ప్రసంగిస్తారు. బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు గులాబీ నేతలు. తెలంగాణ మంత్రులు ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ జనగామ జిల్లా టూర్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటీలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.