CM KCR Tour: ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్‌షిప్.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

కొల్లూరులో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ కేసీఆర్ నగర్‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు.

CM KCR Tour: ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్‌షిప్.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Asia largest double bedroom township

CM KCR: సీఎం కేసీఆర్ (CM KCR) ఈరోజు సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పటాన్ చెరువు (Patan Cheruvu) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు. రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్‌షిప్ (double bedroom township) కేసీఆర్ నగర్‌ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటల సమయంలో సీఎం కేసీఆర్ అక్కడకు చేరుకొని ప్రారంభోత్సవం చేస్తారు. 145 ఎకరాల విస్తీర్ణంలో 1489.29 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15,660 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ టౌన్‌షిప్ ప్రారంభోత్సవంలో భాగంగా తొలుత ఆరుగురు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ ఇళ్ల పట్టాలు అందిస్తారు.

CM KCR: రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్

పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న మేధా రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీనికూడా ప్రారంభిస్తారు. కొండకల్‌లో దాదాపు 100 ఎకరాల స్థలంలో వెయ్యి కోట్ల రూపాయలతో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని మేధా సంస్థ నిర్మించింది. అదేవిధంగా పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తారు. 200 పడకలతో 184.87 కోట్ల రూపాయల వ్యయంతో ఆస్పత్రిని నిర్మాణం చేపట్టనున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తయిన అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.