Telangana Thalli Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి..
పార్టీలకు అతీతంగా సంబరాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Telangana Thalli Statue : సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పనులు వేగవంతం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. ఫౌంటేన్ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది.
తెలంగాణ ప్రభుత్వం విజయోత్సవాలను ఘనంగా చేస్తోంది. 9 రోజుల పాటు ఈ వియోత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల చివరి రోజు అంటే ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉండబోతోంది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 7,8,9 తేదీలలో పూర్తి సంబరాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మూడు రోజులు భారీ కార్యక్రమాలకు నిర్వహించనుంది. తెలంగాణ కళా రూపాలు, వంటకాలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించబోతోంది. పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం తలపించేలా ఈ మూడు రోజుల సంబరాలు ఉండనున్నాయి.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేపథ్యంలో రాష్ట్ర సచివాయంలో కొన్ని మార్పులు కూడా చేసింది ప్రభుత్వం. సచివాలయంలో భారీ ఫౌంటేన్ ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఈ ఫౌంటేన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఫౌంటేన్ కు చివరన తెలంగాణ తల్లి విగ్రహం ఉండనుంది. చూపరులకు ఆహ్లాద వాతావరణం ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గేటను మార్చిన నేపథ్యంలో రోడ్డు పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. సమయం దగ్గర పడుతుండటంతో పనులన్నీ సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి విగ్రహావిష్కరణ ఏర్పాటు పనులను స్వయంగా పర్యవేక్షించారు.
ఈ నెల 7,8,9 తేదీల్లో తెలంగాణ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పార్టీలకు అతీతంగా సంబరాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను ఈ సంబరాలకు ఆహ్వానించబోతోంది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రజలను, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా లేదని కాంగ్రెస్ చెబుతోంది. ఈ క్రమంలో కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయబోతోంది. ఈ కొత్త తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు ఎలా ఉండనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Also Read : ప్రతిపక్షంలోనూ దూసుకెళ్తున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను ప్రశ్నించడంలో సక్సెస్..