Cm Revanth Reddy : ఆ కేసుల్లో నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..
మొత్తం నాలుగు కేసులు నమోదు కాగా, అందులో మూడు కేసుల్లో నేడు విచారణకు వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Cm Revanth Reddy : నాంపల్లి ప్రజా ప్రతినిధుల స్పెషల్ కోర్ట్ ముందు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘన కేసులో మనోరంజన్ కాంప్లెక్స్ లోని ప్రజా ప్రతినిధుల స్పెషల్ కోర్టుకు ఆయన హాజరయ్యారు. మూడు కేసుల్లో నేడు కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యారు రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన స్పీచ్ పై బీఆర్ఎస్ ఫిర్యాదులు చేసింది. దీంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
మొత్తం నాలుగు కేసులు నమోదు కాగా, అందులో మూడు కేసుల్లో నేడు విచారణకు వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నల్గొండ టూ టౌన్, కౌడిపల్లి, బేగంబజార్ పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.
ఎన్నికల ప్రచార సమయంలో నలగొండ జిల్లాలో కేసీఆర్ పై చేసిన వాఖ్యలకు మనోరంజన్ కోర్టులో ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు రేవంత్ రెడ్డి. కోర్టు ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ఆయన అటెండయ్యారు. ఓయూ సిటీ, మెదక్ కౌడిపల్లి, బేగంబజార్, తిరుమలగిరి, పెద్దవూర, కమలాపూర్, నల్గొండ.. 9 కేసుల్లో సీఎం రేవంత్ హాజరయ్యారు. తదుపరి విచారణను నాంపల్లి స్పెషల్ కోర్టు మార్చి 20కి వాయిదా వేసింది.
గతంలో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై 9 కేసులు నమోదవడం జరిగింది. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుల మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణకు నేరుగా నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ మూడు కేసుల్లో విచారణకు సీఎం రేవంత్ అటెండయ్యారు. ఒక సాధారణమైన వ్యక్తిగా కోర్టుకు అటెండయ్యారు.
Also Read : లోకల్ బాయ్ నానికి సజ్జనార్ వార్నింగ్.. ఇవేం దిక్కుమాలిన పనులు?
గౌరవ న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. నేరపూరితంగా చేశారని కోర్టు అడగ్గా.. నేను ఎలాంటి నేరం చేయలేదని, నాకు సంబంధం లేని కేసులో ఇరికించారని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నాలుగు కేసులు పెట్టగా, మూడు కేసుల్లో ఇవాళ ఎగ్జామినేషన్ అయిపోయిందని తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ఛైర్మన్ తిరుపతి తెలిపారు.
మూడు కేసుల్లో విచారణకు వ్యక్తిగతంగా హాజరవ్వాలని నాంపల్లి స్పెషల్ కోర్టు గతంలో ఆదేశాలు ఇవ్వగా.. ఒక సాధారణ వ్యక్తిగా నేడు కోర్టు ముందు అటెండ్ అయ్యారు రేవంత్ రెడ్డి. కోర్టు రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ను నమోదు చేసింది.