తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. హైదరాబాద్ విజయవాడ రూట్లో చార్జీల్లో డిస్కౌంట్.. ఎంతెంత తగ్గుతుందో చెక్ చేసుకోండి..

విజయవాడ - హైదరాబాద్ రూట్ లో టీజీఎస్ఆర్టీసీ కల్పించిన రాయితీల గురించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. హైదరాబాద్ విజయవాడ రూట్లో చార్జీల్లో డిస్కౌంట్.. ఎంతెంత తగ్గుతుందో చెక్ చేసుకోండి..

TGSRTC Buses

Updated On : February 20, 2025 / 12:55 PM IST

TGSRTC: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు నిత్యం వేలాది మంది ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా విజయవాడ – హైదరాబాద్ రూట్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువే. కొందరు నిత్యం ఈ మార్గాల్లో బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, తాజాగా.. విజ‌య‌వాడ రూట్‌లో ప్ర‌యాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్‌ చెప్పింది. హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ప్రత్యేక రాయితీలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ రాయితీలతో కల్పించే డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణీకులు వినియోగించుకోవాలని సూచించింది.

Also Read: Veera Raghava Reddy: వీర రాఘవరెడ్డి గురించి వెలుగులోకి షాకింగ్ విషయాలు.. ఓ సన్యాసి మాటల కారణంగా..

విజయవాడ – హైదరాబాద్ రూట్ లో టీజీఎస్ఆర్టీసీ కల్పించిన రాయితీల గురించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ల‌హారి- నాన్ ఏసీ స్లీప‌ర్ క‌మ్ సీట‌ర్, సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లో 10 శాతం, రాజ‌ధాని ఏసీ బ‌స్సుల్లో 8శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు సంస్థ యాజమాన్యం వెల్లడించింది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణీకులు వినియోగించుకోవాలని సంస్థ కోరింది. ఇదిలాఉంటే.. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలని సజ్జనార్ పేర్కొన్నారు. ఈనెల 26న శివరాత్రి పండుగ నేపథ్యంలో హైదరాబాద్‎లో ఉండే వారు సొంతూర్లు వెళ్లే అవకాశం కూడా ఉండటంతో ఆర్టీకి భారీ లాభం రానుంది.

Also Read: Rajalingamurthy: మేడిగడ్డపై కేసీఆర్, హరీశ్ మీద కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య.. భూ వివాదమే కారణం

ఈనెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసరతోపాటు తదితర ప్రాంతాలకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోంది. ఈ అంశంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి సూచించారు.