CM Revanth Reddy : దేశ నిర్మాణంలో విద్యార్థులను తయారు చేసిన కాకా వెంకటస్వామి : సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో గాంధీ కుటుంబం ఎలాగో.. తెలంగాణలో కాంగ్రెస్ కాకా ఫ్యామిలీ అలా అని అన్నారు. సామాజిక బాధ్యతగా పనిచేస్తున్న ఈ సంస్థకు సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

CM Revanth Reddy : దేశ నిర్మాణంలో విద్యార్థులను తయారు చేసిన కాకా వెంకటస్వామి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy (3)

CM Revanth Reddy : దేశ నిర్మాణంలో విద్యార్థులను కాకా వెంకటస్వామి తయారు చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సామాజిక బాధ్యతను నెరవేర్చిన వ్యక్తి కాకా అని పేర్కొన్నారు. వివేక్, వినోద్ లను చూస్తే రామాయణంలో లవకుశులు గుర్తొస్తారని పేర్కొన్నారు. ఎంత సంపాదించామన్నది కాదు.. ఎంత సమాజానికి పంచామన్నది ముఖ్యం అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలో బీఆర్ అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ప్రతి ఏడాది 3000 మంది విద్యార్థులను తయారు చేస్తుందన్నారు. కాంగ్రెస్ 10 జనపథ్.. కాకా పేరు మీదనే ఉందని వెల్లడించారు. కాకా స్ఫూర్తితో పనిచేస్తే.. లక్ష్యం నెరవేర్చుకోవచ్చన్నారు. మీరు భుజాల మీద మోశారు కాబట్టే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని.. తాను సీఎం అయ్యానని, తాము సేవకులమని అన్నారు.

Also Read : పార్లమెంట్‌లో జరిగిన దాడి దేశంపై జరిగినట్లే.. అంబేద్కర్ గుండెపై జరిగినట్లే : కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతల విమర్శలు

ప్రజలు, పార్టీ ఇచ్చిన బాధ్యతతో తామంతా ప్రతి రోజూ కష్టపడుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. కఠోరమైన దీక్షతో ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. దేశంలో గాంధీ కుటుంబం ఎలాగో.. తెలంగాణలో కాంగ్రెస్ కాకా ఫ్యామిలీ అలా అని వ్యాఖ్యానించారు. సామాజిక బాధ్యతగా పనిచేస్తున్న ఈ సంస్థకు సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.