దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారో బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పాలి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని బీఆర్ఎస్ ఏడుస్తోందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

CM Revanth Reddy
బీఆర్ఎస్, బీజేపీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూసీ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటాయో బీఆర్ఎస్, బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో రూ.లక్షన్నర కోట్లు ఖర్చుపెడితే హైదరాబాద్ అద్భుతనగరం అవుతుందని తెలిపారు.
హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని బీఆర్ఎస్ ఏడుస్తోందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ఎందుకు నిధులు తేవట్లేదని ప్రశ్నించారు. తాము వర్షపు నీటిని నిల్వచేసేలా వాటర్ హార్వెస్టింగ్ బావులను నిర్మిస్తున్నామని తెలిపారు.
తమ ప్రభుత్వ హయాంలో స్థిరాస్తి వ్యాపారం 29 శాతం పెరిగిందని, అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చుతోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ పునరుజ్జీవనం చేయకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే మూసీ అభివృద్ధికి కిషన్ రెడ్డి నిధులు తీసుకురావాలని చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు