CM Revanth Reddy: గణేశ్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడు డ్యాన్స్ చూశారా.. మురిసిపోయిన రేవంత్.. వీడియో వైరల్

గణేశ్ నిమజ్జన వేడుకల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గణపతిని నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవానికి తరలిస్తున్న సమయంలో

CM Revanth Reddy: గణేశ్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడు డ్యాన్స్ చూశారా.. మురిసిపోయిన రేవంత్.. వీడియో వైరల్

CM Revanth Reddy grandson dances

Updated On : September 17, 2024 / 12:07 PM IST

CM Revanth Reddy grandson dances: హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనోత్సవ వేడుకలు భక్తుల కోలాహలం మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి గణపయ్యలకు వీడ్కోలు పలుకుతున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవాలతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. దీంతో పోలీసులు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి యువత, మహిళలు గణనాథుల నిమజ్జనంలో డప్పుదరువులకు డ్యాన్సులు వేస్తూ సందడి చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం మొత్తం కోలాహలంగా మారింది.

Also Read : Khairatabad Ganesh: భక్తజన సందోహం మధ్య ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జన శోభాయాత్ర.. ప్రత్యక్షప్రసారం

గణేశ్ నిమజ్జన వేడుకల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గణపతిని నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవానికి తరలిస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి మనవడు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వినాయకుడి నిమజ్జనానికి తరలిస్తున్న వాహనం ముందు రేవంత్ మనుడు డప్పుల దరువులకు అనుగుణంగా ముద్దుముద్దుగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. అక్కడే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, అతని సతీమణి, కూతురు బుడ్డోడి డ్యాన్స్ చూసి మురిసిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.