తెలంగాణలో మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. వారు తయారు చేసిన వంటకాలు…

ఈ నెలాఖరులోపు మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణ పూర్తవుతుంది. మార్చి 31 లోపు వరంగల్ ఎయిర్ పోర్టు పనులు ప్రారంభిస్తాం.

తెలంగాణలో మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. వారు తయారు చేసిన వంటకాలు…

Updated On : December 5, 2025 / 6:36 PM IST

Cm Revanth Reddy: వరంగల్ జిల్లా పర్యటన తనకు ప్రతిసారి కొత్త స్ఫూర్తిని ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గడీలలో ఉన్న నాయకుల కరెంట్ పీకేశామన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ పేటెంట్ రైట్స్ కాంగ్రెస్ పార్టీదే అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేస్తున్న చరిత్ర తెలంగాణ రాష్ట్రానిది అని వ్యాఖ్యనించారు.

కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసిన ఘనత తెలంగాణది అని తెలిపారు. రాష్ట్రంలో కోటి 10 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. హనుమాన్ గుడి లేని ఊరు ఉండొచ్చు.. కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

”పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏ ఊళ్ళో ఇళ్లు కట్టించారో చూపాలి.. నేనే వస్తా.. నర్సంపేటకు మరో 3వేల 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ అనే నెహ్రూ పాలసీని మేము అమలు చేస్తున్నాం. వరంగల్ కు ఎయిర్ పోర్టు తీసుకొస్తున్నాం. కేసీఆర్ ఒక్కరోజైనా వరంగల్ ఎయిర్ పోర్టు గురించి ఆలోచించారా? విదేశాల్లో చదువుకున్నామని పొడుగు పొడుగు మాటలు చెప్పే వాళ్లకు తెలంగాణలో రెండవ ఎయిర్ పోర్టు తేవాలని సోయి ఎందుకు లేదు?

ఈ నెలాఖరులోపు మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణ పూర్తవుతుంది. మార్చి 31లోపు వరంగల్ ఎయిర్ పోర్టు పనులు ప్రారంభిస్తాం. తెలంగాణ ఆడపడుచులు తయారు చేసే ఉత్పత్తులు ఆన్ లైన్ లో కొనుక్కునే పరిస్థితి రాబోతుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: అర్బన్ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు: శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి