Cm Revanth Reddy: వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ, అదే మా లక్ష్యం- సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రైజింగ్ కార్యాచరణతో రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమానంగా సాగుతున్నాయని చెప్పారు.

Cm Revanth Reddy: వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ, అదే మా లక్ష్యం- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

Updated On : May 13, 2025 / 12:40 AM IST

Cm Revanth Reddy: దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ నెంబర్ 1గా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నానక్ రామ్ గూడలో సోనాటా సాఫ్ట్ వేర్ సంస్థ ఫెసిలిటీ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. సాఫ్ట్ వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచానికి హబ్ గా మారిందన్నారు. ప్రపంచ ఈవెంట్లకు తెలంగాణ వేదికగా నిలుస్తోందన్న సీఎం రేవంత్.. హైదరాబాద్ ను అత్యద్భుత నగరంగా మారుస్తామని చెప్పారు.

Also Read: టీ-బీజేపీ పగ్గాలు ఎవరికి? తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదుగుతోందా?

తెలంగాణ రైజింగ్ కార్యాచరణతో రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమానంగా సాగుతున్నాయని చెప్పారు. డిసెంబర్ 2023 నుంచి 3 లక్షల కోట్ల పెట్టబడులు, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్.. సాఫ్ట్ వేర్, లైఫ్ సైన్సెస్, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ గా హబ్ గా మారిందని చెప్పారు. ఏఐ, డేటా సెంటర్లు తయారీ రంగాల కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుతోందని.. మైక్రోసాఫ్ట్, కాంగ్నిజెంట్, హెచ్ సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో తమ క్యాంపస్ విస్తరణకు హైదరాబాద్ డెస్టినీగా మారిందని చెప్పారు.