కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక విన్నపం..

మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మించాల్సి ఉందని తెలిపారు. ఇందుకు అవసరమైన రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ కు ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు.

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక విన్నపం..

Cm Revanth Reddy : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రక్షణశాఖ భూముల బదలాయింపుపై రాజ్ నాథ్ తో రేవంత్ చర్చించారు. హైదరాబాద్ నగరంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెహిదీపట్నం రైతుబజార్ దగ్గర స్కైవాక్ నిర్మిస్తున్న విషయాన్ని రాజ్ నాథ్ కు వివరించారు. ఇందుకోసం అక్కడున్న 0.21 హెక్టార్ రక్షణ భూమిని బదిలీ చేయాలని కోరారు. స్కై వాక్ నిర్మాణం రక్షణశాఖ భూమిలో మినహా పూర్తి కావొస్తోంది.

దీంతో వీలైనంత త్వరగా ఆ భూమి బదిలీకి చొరవ చూపాలని రాజ్ నాథ్ ను సీఎం రేవంత్ అభ్యర్థించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్-రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ ఎగ్జిట్ ర్యాంప్ ల నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరం ఉందని రేవంత్ వివరించారు. మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మించాల్సి ఉందని తెలిపారు. ఇందుకు అవసరమైన రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ కు ముఖ్యమంత్రి రేవంత్ విన్నవించారు.

భవిష్యత్తులో మెట్రో కోసం కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదన చేశామని రాజ్ నాథ్ కు రేవంత్ వివరించారు. ఈ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణశాఖ భూములు బదిలీ చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ ను కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

* ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
* తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులకు విన్నపం
* హైదరాబాద్ లో రక్షణశాఖ భూముల బదలాయింపుపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ విజ్ఞాపన
* డిఫెన్స్ భూములు, వరంగల్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై రేవంత్ విజ్ఞప్తి
* జీహెచ్ఎంసీ, హైదరాబాద్- కరీంనగర్ రాజీవ్ రహదారి, హైదరాబాద్ – నాగ్ పూర్ జాతీయ రహదారి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూములు కావాలని విన్నపం
* భూములు ఇచ్చేందుకు అనుమతించిన కేంద్రం..!
* కేంద్ర రక్షణశాఖకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు..
* మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రక్షణశాఖ ఆధీనంలో ఉన్న భూములు ఇవ్వాలని సీఎం రేవంత్ విన్నపం
* జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై రక్షణశాఖతో సుదీర్ఘ చర్చలు
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రెండు సైనిక్ స్కూల్స్ ఏపీకి వెళ్లినందున.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై సీఎం రేవంత్ విజ్ఞాపన.

హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లేన్ల రోడ్ గా మార్చాలి- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి
తెలంగాణ లో ఓటు షేర్ పెంచుకున్నాం. సుస్థిర పాలన అందిస్తున్నాం. 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ పై చర్చ జరుగుతోంది. కానీ, ముందుకు కదలడం లేదు. రీజనల్ రింగ్ రోడ్ ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యమైంది. హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లేన్ల రహదారిగా మార్చాలి. రోజుకి 60 వేల వాహనాలు తిరుగుతాయి. 370 చోట్ల ప్రమాద జోన్లను గుర్తించాం. త్వరగా హైదరాబాద్ విజయవాడ 6 లేన్ల రహదారి పనులు చేపట్టాలని కోరాం. రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రత్యేక సమావేశం పెడతామని చెప్పారు. 16 రోడ్లు పెండింగ్ లో ఉన్నాయి.

నూతన జాతీయ రహదారుల కోసం మరో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉప్పల్ ఘట్ కేసర్ ఫ్లైఓవర్ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు. బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలుస్తా. రేపు కిషన్ రెడ్డిని కలుస్తా. భూపేంద్ర యాదవ్ తో అటవీ పర్యావరణ అనుమతుల గురించి చర్చిస్తా. నేను అభిపవృద్ధి పనుల కోసం ఢిల్లీ వచ్చా. నేషనల్ హైవే నిధులు ఎక్కువగా తెలంగాణకు ఇవ్వాలని కోరా. వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు, విజయవాడ హైదరాబాద్ 6 లేన్ల రహదారిని పూర్తి చేస్తాం”.

Also Read : కాంగ్రెస్‌లో చేరికల చిచ్చు.. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా? రంగంలోకి మంత్రి శ్రీధర్ బాబు