కాంగ్రెస్‌లో చేరికల చిచ్చు.. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా? రంగంలోకి మంత్రి శ్రీధర్ బాబు

కాంగ్రెస్ లో సంజయ్ చేరికపై అధిష్టానం తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జీవన్ రెడ్డి వాపోయారు.

కాంగ్రెస్‌లో చేరికల చిచ్చు.. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా? రంగంలోకి మంత్రి శ్రీధర్ బాబు

Mlc Jeevan Reddy : చేరికల వ్యవహారం కాంగ్రెస్ లో చిచ్చు రాజేసింది. బీఆర్ఎస్ నేత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిక పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. సంజయ్ చేరికను జీవన్ రెడ్డి, ఆయన అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. సంజయ్ చేరిక గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జీవన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్ లో సంజయ్ చేరికపై అధిష్టానం తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జీవన్ రెడ్డి వాపోయారు. ఇన్నేళ్లు సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి ప్రత్యర్థులుగా తలపడ్డారు. అలాంటిది.. తనకు మాట మాత్రమైన చెప్పకుండా తన ప్రత్యర్థిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపం చెందారు. తనకు సమాచారం లేకుండా ఎమ్మెల్యేను చేర్చుకున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ చేరిక వ్యవహారంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు జగిత్యాలకు బయలుదేరారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిన్న రాత్రి కాంగ్రెస్ లో చేరారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Also Read : పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడడం హాస్యాస్పదం: షబ్బీర్ అలీ