LB Stadium : 3 వేదికలు.. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు

అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ.. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు.

LB Stadium : 3 వేదికలు.. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు

Huge Arrangements In Lb Stadium For Revanth Reddy Oath Ceremony

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి(డిసెంబర్ 7) సభలో మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదికను, రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ కి స్వాగతం పలకనున్నారు.

Also Read : దివ్యాంగురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే..

ఇక, అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ.. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు. 30వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు అరేంజ్ చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండటంతో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. ఇప్పటికే అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 8వ గేటు నుంచి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఉంటుందన్నారు. ఢిల్లీ నుంచి వస్తున్న నేతలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించామన్నారు.

Also Read : కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఆర్నెళ్లే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు