Cm Revanth Reddy: డిసెంబర్ 9న.. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ- సీఎం రేవంత్ రెడ్డి
రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని వెల్లడించారు.

Cm Revanth Reddy: మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్క్‌లో మలబార్ జెమ్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు సీఎం రేవంత్‌రెడ్డి. హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. మలబార్ తయారీ యూనిట్‌ను మహేశ్వరంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఫోర్త్ సిటీ.. భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామన్నారు. ప్రభుత్వాలు మారినా మన పారిశ్రామిక పాలసీలను మార్చుకోలేదని సీఎం రేవంత్ అన్నారు. పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని ఆయన వివరించారు.
”ప్రపంచ దేశాలతో పోటీపడేలా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్ అంటే ఐటీ మాత్రమే కాదు. అన్ని రంగాల్లో హైదరాబాద్ ను అభివృద్ధి చేసేలా ప్రణాళికతో ముందుకు పోతున్నాం. గోల్డ్ వ్యాపారంలోనూ హైదరాబాద్ అగ్రగామిగా నిలవాలి. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి మాత్రం ఆగదు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: ఫార్ములా ఈ రేస్ కేసు.. కేటీఆర్ ఆదేశాలతోనే..! ఏసీబీ విచారణలో IAS అరవింద్ కుమార్
”ఈరోజు దేశంలో ఐటీ అంటే హైదరాబాద్, ఫార్మా అంటే హైదరాబాద్, దేశంలో బల్క్ డ్రగ్స్ లో 35శాతం ప్రొడక్షన్ హైదరాబాద్ నుంచే. ఫార్మా, ఐటీలో హైదరాబాద్ లెజెండ్ గా ఉంది. ఇప్పుడు గోల్డ్ లోనూ హైదరాబాద్ లెజెండ్ గా మారింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ తయారీ యూనిట్ హైదరాబాద్ లో ఏర్పాటైంది. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ, మేము మా పాలసీలు, ఇన్సెంటివ్ లు మార్చలేదు.
ప్రతి పెట్టుబడిదారుడికి నేను భరోసా ఇస్తున్నా. మేము ఉన్న మీకు సపోర్ట్ చేయడానికే, ఇన్సెంటివ్స్ ఇవ్వడానికే. మీకు కావాల్సిన ప్రతిదీ ఇస్తాం. రండి.. పెట్టుబడులు పెట్టండి.. మీ వ్యాపారం చేసుకోండి.. తెలంగాణ అంటే వ్యాపారం.. తెలంగాణ అంటే లాభాలు.. రండి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. మేమున్నది మీకు సపోర్ట్ చేయడానికే..” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.