Formula E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసు.. కేటీఆర్ ఆదేశాలతోనే..! ఏసీబీ విచారణలో IAS అరవింద్ కుమార్

HMDW ఖాతా నుండి FEO కంపెనీకి నిధుల మళ్లింపుపై తన ప్రమేయం లేదన్నారు అరవింద్ కుమార్.

Formula E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసు.. కేటీఆర్ ఆదేశాలతోనే..! ఏసీబీ విచారణలో IAS అరవింద్ కుమార్

Updated On : July 3, 2025 / 5:23 PM IST

Formula E Race Case: తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ACB విచారణకు IAS అరవింద్ కుమార్ హాజరయ్యారు. జూన్ 16న మాజీ మంత్రి కేటీఆర్ స్టేట్ మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ ను విచారించారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా, అరవింద్ కుమార్ ఏ2గా ఉన్నారు. అరవింద్ కుమార్ ఏసీబీ విచారణలో కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి KTR ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని అరవింద్ కుమార్ చెప్పినట్లు సమాచారం.

HMDW ఖాతా నుండి FEO కంపెనీకి నిధుల మళ్లింపుపై తన ప్రమేయం లేదన్నారు అరవింద్ కుమార్. కేటీఆర్ స్వయంగా వాట్సప్ ద్వారా FEO కి నిధులు విడుదల చేయాలని ఆదేశించారని అరవింద్ కుమార్ వెల్లడించారు. ఇందులో తనకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని అరవింద్ కుమార్ చెప్పారు. బిజినెస్ రూల్స్, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని అప్పటి మంత్రి కేటీఆర్ కి చెప్పానన్నారు.

Also Read: హైదరాబాద్‌లో దారుణం.. బెట్టింగ్ డబ్బుల విషయంలో తండ్రి ప్రశ్నించాడని.. సర్‌ప్రైజ్ చేస్తానంటూ.. కళ్లకు గంతలు కట్టి.. గొంతులో కత్తితో..

FEO కంపెనీకి వెంటనే నిధులు విడుదల చేయాలని, అవన్నీ నేను చూసుకుంటానని కేటీఆర్ చెప్పారని అరవింద్ కుమార్ పేర్కొన్నారు. రూ.45.71 కోట్ల నగదును ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించామని ఏసీబీ విచారనలో అరవింద్ కుమార్ తెలిపినట్లు సమాచారం.