Cm Revanth Reddy : కేంద్రానికి సవాల్… జనగణనతో పాటు కులగణన చెయ్యాలి.. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ లను బహిష్కరణ చెయ్యాలి- సీఎం రేవంత్ రెడ్డి

మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. జనజీవన స్రవంతిలో కలవని వారి కోసం రెండో విడత సర్వేకి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం మాది.

Cm Revanth Reddy : కేంద్రానికి సవాల్… జనగణనతో పాటు కులగణన చెయ్యాలి.. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ లను బహిష్కరణ చెయ్యాలి- సీఎం రేవంత్ రెడ్డి

Updated On : February 14, 2025 / 6:36 PM IST

Cm Revanth Reddy : కేంద్రానికి సవాల్ విసిరారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జనగణనతో పాటు కులగణన చెయ్యాలన్నారు. కేంద్రం లెక్కలు, తెలంగాణ ప్రభుత్వం చేసిన లెక్కలను సరిపోల్చుదామన్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లను బహిష్కరణ చెయ్యాలని రేవంత్ రెడ్డి అన్నారు. బహిష్కరణ కోసం అందరి సమక్షంలో తీర్మానం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సర్వే తప్పుల తడక అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేసిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదు. మోదీ లీగల్లి కన్వర్టెడ్ బీసీ. సర్టిఫికెట్ లో మోదీ బీసీ. కానీ.. మోదీ మనసంతా బీసీ వ్యతిరేకి. భారత్ జోడో యాత్రలోనే రాహుల్ గాంధీ స్పష్టంగా కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఉన్న అన్ని జాతులకు వారి ఫలాలు అందాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. రాష్ట్రంలో డోర్ టు డోర్ వెళ్లిన సిబ్బంది ముందే డేటా ఎంట్రీ చేశాం.

కేసీఆర్ సర్వే.. కాకి లెక్కల సర్వే. తెలంగాణ సమాజంలో తిరిగే హక్కు కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావ్ లకు లేదు. సమగ్ర కుటుంబ సర్వేకి కేసీఆర్ లెక్కలు ఇచ్చి ఉంటే మాట్లాడే హక్కు ఉండేది. సర్వేలో డేటా ఇయ్యని లిస్ట్ లో ముందు వరుసలో కేసీఆర్, కేటీఆర్, సంతోశ్ రావ్, గ్యాంబ్లింగ్ శ్రీనివాస్ లు ఉన్నారు.

కేసీఆర్ లెక్క తేలితే.. వార్డు మెంబర్ కూడా ఆ కుటుంబానికి రాదు. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. జనజీవన స్రవంతిలో కలవని వారి కోసం రెండో విడత సర్వేకి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం మాది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : బీజేపీ అధ్యక్ష పదవి ఎంపికలో రోజుకో ట్విస్ట్‌.. మారుతున్న ఈక్వేషన్లు, రేసులో కొత్త కొత్త పేర్లు..

బీసీ కులగణన సర్వేకు సంబంధించి గాంధీభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించింది కాంగ్రెస్. కులగణన సర్వేలో వివరాలను పక్కాగా నమోదు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి జరగలేదని, వివక్ష చూపలేదని రేవంత్ అన్నారు.

అయినా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొన్ని కులసంఘాల విజ్ఞప్తి మేరకు రీ సర్వే చేసేందుకు నిర్ణయించామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రధాని మోదీపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. మోదీ మొదటి నుంచి బీసీ కాదని, మధ్యలో కన్వర్టెడ్ బీసీ అని చెప్పారు.